ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

ఠాగూర్
ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (10:39 IST)
ఉసిరితో ఒరిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే! అయితే ఉసిరిని పరగడుపున తింటే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు, పెద్దపేగు ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుంది. ఉసిరితో అందే ఇంకొన్ని ఆరోగ్య ప్రయోజాలను పరిశీలిస్తే, విటమిన్ సి సమృద్ధిగా దొరికే ఉసిరిని పరగడుపున తింటే వ్యాధులతో పోరాడే వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు, సీజనల్ రుగ్మతలైన జలుబు, దగ్గులు కూడా దరి చేరకుండా ఉంటాయి. 
 
ఉసిరి జీర్ణరసాలను ప్రేరేపింంచి, పేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. దాంతో జీర్ణశక్తి పెరగడంతో పాటు, పోషకాల శోషణ కూడా మెరుగవుతుంది. మలబద్ధకం కూడా వదులుతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సిలు, చర్మానికి బిగుతునిచ్చే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దాంతో చర్మం మీద ముడతలు తొలగి చర్మంనునుపుగా మారుతుంది.
 
* చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాంతో గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. ఉసిరితో అధిక రక్తపోటు అదుపులోకొస్తుంది.
* మెటబాలిజం పెరిగి, శరీరంలోని విషాలు బయటకు వెళ్లిపోయి శరీర బరువు కూడా అదుపులోకొస్తుంది. ఉసిరిలోని పీచు ఆకలిని అదుపులో ఉంచి, అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరకుండా నియంత్రిస్తుంది.
* రక్తంలోని చక్కెర మోతాదులు క్రమబద్ధమై మధుమేహులకు ప్రయోజనాన్ని అందిస్తుంది. అలాగే మధుమేహ సంబంధ ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందాలన్నా, పరగడుపున ఉసిరి తినాలి. 
* యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఉసిరి తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఉసిరి శరీరంలోని విషాలను హరిస్తుంది. కాబట్టి కాలేయం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఉదయాన్నే
ఉసిరి తినాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

తర్వాతి కథనం
Show comments