Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ground-nuts

సిహెచ్

, శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (22:52 IST)
శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుశెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. వేరుశనగపప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
 
వేరుశనగ పప్పుల్లో గుండెకు మేలు చేసే కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్‌ శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. 
పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి.
వేయించిన తాజా వేరుశనగ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట.
హెపటైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ వంటివి రాకుండా వుండాలంటే వేరుశనగ పప్పులు తింటుండాలి. 
నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు కొంచెం పల్లీలు నానబెట్టి బెల్లంతో కలిపి తింటే ఐరన్‌తో పాటు అన్ని రకాల పోషకాలూ అందుతాయి.
వృద్ధాప్యం దరిచేరకుండా నిత్యయవ్వనంతో ఉండాలంటే వేరుశనగ పల్లీలు తింటుండాలి.
తాజా పచ్చి పల్లీలకు చిటికెడు ఉప్పు రాసి తింటే చిగుళ్లు గట్టిబడి దంతాల్ని సంరక్షిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?