Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీహైడ్రేషన్‌తో పాటు బరువును తగ్గించే సబ్జా గింజలు.. ఎలా?

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:18 IST)
సాధారణంగా వేసవికాలంలో ప్రతి ఒక్కరి ఇళ్లలో సబ్జా గింజలు కనిపిస్తుంటాయి. అలాగే, శీతలపానీయాల్లో కూడా సబ్జా గింజలను వేసుకుని సేవిస్తుంటారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఈ సబ్జా గింజలు డీహైడ్రేషన్‌తో పాటు బరువును కూడా తగ్గిస్తాయి. 
 
బరువు తగ్గాలనుకునే స్త్రీలు సబ్జా గింజలు ఓ దివ్యౌషధంగా చెప్పుకోవచ్చు. ఈ గింజలను నానబెట్టిన నీటిని తాగితే బరువు తగ్గిపోతారని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుందని చెబుతున్నారు.
 
బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు, ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడటంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
 
శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను తాగడం సహజంగా బరువుని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. 
 
సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.
 
ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ ‘ఇ’ లభించడంతో బాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కనుక వేసవిలో దాహార్తితో పాటు.. శరీర బరువుని కూడా తగ్గించే సబ్జాలను తాగండి. ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments