Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయిలో ఏముంది...? తింటే ఏం జరుగుతుంది...?

* చక్కటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చిట్కాగా ఉపయోగించ దగిన ఈ పండులోని పోషక విలువల ఒక కేజీ బరువుండే బొప్పాయి నుంచి 120 క్యాలరీలు, 30 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ప్రోటీన్, 15 శాతం విటమిన్ 'ఎ', 224 శాతం విటమిన్ 'సి', 19 శాతం పీచు పదార్థం, 14

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (17:19 IST)
* చక్కటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చిట్కాగా ఉపయోగించ దగిన ఈ పండులోని పోషక విలువల ఒక కేజీ బరువుండే బొప్పాయి నుంచి 120 క్యాలరీలు, 30 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ప్రోటీన్, 15 శాతం విటమిన్ 'ఎ', 224 శాతం విటమిన్ 'సి', 19 శాతం పీచు పదార్థం, 14 శాతం మెగ్నీషియం, 14 శాతం పొటాషియం, 13శాతం కాపర్, 11 శాతం పాంటోథెనిక్ ఆమ్లం, 26 శాతం ఫోలేట్ లభిస్తాయి.
 
* బొప్పాయిలో ఉండే పీచు, పొటాషియం, విటమిన్లు మన గుండెకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. ఇది శరీరంలో పొటాషియం శాతాన్ని పెంచుతూ సోడియం శాతాన్ని తగించడం వల్ల గుండె వ్యాధుల తీవ్రత తగ్గడమే కాదు.. బీపీ కూడా అదుపులో ఉంటుంది. విటమిన్ 'ఎ', విటమిన్ 'సి' శరీరంలోని కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ప్రక్రియకు అడ్డుపడతాయి. అందుకే బొప్పాయి ఎక్కువగా తినేవారిలో కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉండదు.
 
*బొప్పాయిలో ఉండే  విటమిన్ 'ఎ', విటమిన్ 'సి' మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎప్పుడూ ముందుంటాయి. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చెవి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూడడమే కాక జలుబును నియంత్రించడంలో కూడా బొప్పాయి కీలకపాత్ర వహిస్తుంది. కీళ్లనొప్పులు, మధుమేహం, ఎముకల సమస్యలతో పాటు పెద్దపేగు క్యాన్సర్ వంటి సమస్యల ముప్పుని బొప్పాయి తగ్గిస్తుంది.
 
* బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్‌లు ఎక్కువగా ఉండడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు, నొప్పులు, ఎలర్జీలు వంటి సమస్యల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది.
 
* శరీరంలో పేరుకున్న కొవ్వును తగ్గించడంలో బొప్పాయికి మించినది లేదు. అధిక బరువుతో బాధపడేవారు బొప్పాయిని రోజూ తీసుకుంటే తక్కువ క్యాలరీలతో ఎక్కవ పీచుపదార్థం శరీరానికి అందుతుంది.ఇందులోని పపైన్ అనే ఎంజైమ్ జీర్ణ సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు. పీచు పదార్థాలతో పాటు నీటి శాతం కూడా పుష్కలంగా ఉండడం వల్ల  దీంతో తొందరగా బరువు తగ్గడంతో పాటు  అలసట, మలబద్ధకం, త్వరగా ఆకలవడం వంటి సమస్యలు ఉండవు.
 
* బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులకు ఇదో అద్భుత నివారిణిగా పనిచేస్తుంది. కాలిన గాయాలపై బొప్పాయి గుజ్జును రాస్తే ఆ గాయం త్వరగా మానిపోతుంది. అందుకే ఈ ఎంజైమ్‌ని కొన్ని గాయాలు మాన్పే క్రీములలో కూడా ఉపయోగిస్తారు. అదే విధంగా బొప్పాయిలోని విటమిన్ 'ఎ' కారణంగా 'సెబమ్' అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఇది మన జుట్టును తేమగా ఉంచడంలో ఎంతో తోడ్పడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వధువే అసలైన కానుక... రూ.లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించిన వరుడు!!

బాబ్బాబు.. మీకు దణ్ణం పెడతాం.. భారత్ దాడి నుంచి రక్షించండి.. గల్ఫ్ దేశాలకు పాక్ వినతి!!

శ్రీ లైరాయిదేవి ఆలయ జాతరలో తొక్కిసలాట : ఏడుగురి దుర్మరణం

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

తర్వాతి కథనం
Show comments