ఆస్తమాను అడ్డుకునే కృష్ణతులసి, ఏం చేయాలంటే?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (19:56 IST)
తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసి తేనె లేదా పెరుగుతో పాటు సేవిస్తే చాలా రోగాలు నివారణ అవుతాయి. పాలతో మాత్రం తీసుకోకూడదు. పొద్దున్నే అల్పాహారానికి అరగంట ముందు తులసి రసాన్ని సేవిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. రోజుకు మూడు సార్లు కూడా సేవించవచ్చు. 
 
మలేరియా వచ్చినపుడు ఐదు నుంచి ఏడు తులసి ఆకులను నలిపి మిరియాల పొడితో తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పది గ్రాముల తులసి రసాన్ని పది గ్రాముల అల్లం రసంతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 
 
పిల్లలకు వాంతులు అవుతున్నప్పుడు కొద్దిగా తులసి విత్తనాలను పెరుగు లేదా తేనెతో కలిపి నాకిస్తే అవి తగ్గుముఖం పడతాయి. నల్ల తులసి రసాన్ని మిరియాలపొడిలో వేసి ఆ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యితో కలిపి సేవిస్తే గ్యాస్ట్రిక్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
తులసి ఆకులను నీళ్లలో మరిగించి తీసుకుంటే చెవి నొప్పికి మంచి మందుగా పనిచేస్తుంది. నల్ల తులసి ఆకుల్ని ఏడు బాదం పప్పులు, నాలుగు లవంగాలను కలిపి తింటే జీర్ణశక్తికి చాలా మంచిది. 
 
నల్ల తులసి ఆకులు, తేనేను సమపాళ్లలో కలిపి కళ్లకు రాస్తే అలసట తగ్గడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇరవై ఐదు గ్రాముల తులసి రసాన్ని రెండు గ్రాముల నల్ల ఉప్పును కలిపి నాలుగు రోజులు క్రమంగా తీసుకుంటే నులిపురుగులు నశిస్తాయి. ఆస్తమా రోగులు ప్రతి రోజూ ఐదు నుంచి ఇరవైఐదు గ్రాముల నల్లతులసి రసాన్ని తేనేతో కలిపి తీసుకుంటే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణకు అరుదైన గౌరవం.. పోచంపల్లి ఇకాట్‌ను ధరించి కేన్స్‌లో మెరిసిన రష్మీ

ఏపీ రాష్ట్రంలో సీ ప్లేన్ ప్రాజెక్టు ప్రారంభానికి కీలక ప్రోత్సాహం.. రూ.200 కోట్లు కేటాయింపు

కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ: రూ. 50 లక్షల వరకు స్పాట్‌లో మంజూరు

నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు - పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు

నా ఫోటోతో తమిళనాట విజయ్ గెలిచారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుందాగా సమాధానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments