Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్వరాన్ని నిరోధించే ధనియాల కషాయం

జ్వరాన్ని నిరోధించే ధనియాల కషాయం
, సోమవారం, 30 ఆగస్టు 2021 (17:33 IST)
వర్షాలు ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. వీటిలో జలుబు, జ్వరం ముందు వరసలో వుంటాయి. వీటికి చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య తగ్గిపోతుందని చెపుతారు ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా జ్వరం తగ్గడానికి ధనయాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయంటున్నారు.
 
ధనియాలను బరకగా నూరి, దాని తూకానికి ఆరు రెట్లు చన్నీళ్లుపోసి రాత్రంతా ఉంచాలి. ఉదయం పంచదార కలుపుకొని తాగితే శరీరంలో మంట, వేడి తగ్గుతాయి.
 
ధనియాలును, చెదుపొట్ల ఆకులను కషాయం తయారుచేసుకొని తాగితే జ్వరంలో ఆకలి పెరుగుతుంది. సుఖ విరేచనమై జ్వరం దిగుతుంది.
 
జ్వరంలో ఆకలిని పెంచడానికి, ఉష్ణోగ్రత తీవ్రతను తగ్గించడానికి 2 భాగాలు ధనియాలను, 1 భాగం శొంఠిని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసుకొని తీసుకోవాలి.
 
శిశిరంలో వచ్చే జ్వరాలను తగ్గించుకోవడానికి ధనియాలు, శొంఠితో కషాయం తయారుచేసుకొని, నిమ్మరసాన్ని, పంచదారనూ కలిపి తీసుకోవాలి. 
 
ధనియాల పొడి కొలెస్టరాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. రెండు చెంచాలు ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా రెండుపూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంటువ్యాధులను అడ్డుకునే జామకాయలు