Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొడలు రాసుకుని ఎర్రగా కందిపోతున్నాయా? అయితే ఇవిగో నివారణ చిట్కాలు

చాలా మంది స్త్రీపురుషులకు తొడల మధ్య రాపిడి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా తొడలు ఎర్రగా కందిపోతుంటాయి. ఒకవైపు మంటతో పాటు.. మరోవైపు దురద పుడుతుంది.

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (10:04 IST)
చాలా మంది స్త్రీపురుషులకు తొడల మధ్య రాపిడి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా తొడలు ఎర్రగా కందిపోతుంటాయి. ఒకవైపు మంటతో పాటు.. మరోవైపు దురద పుడుతుంది. దీనికి చెమట అధికంగా పోయడం వల్ల కూడా చికాకు పడుతుంటాయి. ఈ కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. 
 
వేసవికాలంలో అయితే మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఊబకాయులకైతే ఈ సమస్య నిరంతరం ఉంటూనే ఉంటుంది. ప్రధానంగా మహిళలకు, కొంత మంది పురుషులకు కూడా ఈ తరహా సమస్య ఎక్కువగా వస్తుంటుంది. అయితే చాలామంది మంది దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు, సూచనలు పాటిస్తే పాటిస్తే. వీటి నుంచి బయట పడే అవకాశాలు ఉన్నాయి. 
 
మంట, దురదగా ఉన్న తొడ భాగాల్లో కొద్దిగా కొబ్బరినూనెను రాయడం వల్ల సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ల నీరు, కొన్ని చుక్కల లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తొడలు రాసుకునే చోట అప్లై చేయాలి. 5 నిమిషాలు ఆగాక వేడినీటితో కడిగేయాలి. దీని వల్ల మంట, దురద వంటివి తగ్గి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
అలాగే, ఒక చిన్నపాటి పలుచని టవల్లో కొన్ని ఐస్ ముక్కలు వేసి ఆ టవల్‌ని చుట్టి సమస్య ఉన్న ప్రదేశంలో 5 నిమిషాల పాటు ఉంచాలి. కొంతసేపు ఆగిన తర్వాత మళ్లీ అలాగే చేయాలి. రోజులో ఇలా ఎక్కువ సార్లు చేస్తే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
ముఖానికి పూసుకునే టాల్కం పౌడర్, రోల్ ఆన్ డియోస్ వంటి వాటిని సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే ఆ ఇబ్బంది తొలగిపోతుంది. మంట, దురద కూడా తగ్గుతాయి. బయటికి వెళ్తున్నప్పుడు వీటిని వాడటం వల్ల ఫలితం ఇంకా బావుంటుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments