Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలుబు.. గొంతు నొప్పి తగ్గాలంటే...

చలి కాలం వచ్చిందంటే చాలు... చాలామందికి జ‌లుబు, ద‌గ్గు వ‌స్తుంటాయి. దీంతోపాటు అనేకమందిని గొంతు నొప్పి కూడా బాధిస్తుంది. ఇలా బాధపడేవారు ఒక టేబుల్ స్పూన్ గ‌ళ్ళ ఉప్పు లేదా వంట సోడాను గ్లాస్ గోరువెచ్చని న

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (16:00 IST)
చలి కాలం వచ్చిందంటే చాలు... చాలామందికి జ‌లుబు, ద‌గ్గు వ‌స్తుంటాయి. దీంతోపాటు అనేకమందిని గొంతు నొప్పి కూడా బాధిస్తుంది. ఇలా బాధపడేవారు  ఒక టేబుల్ స్పూన్ గ‌ళ్ళ ఉప్పు లేదా వంట సోడాను గ్లాస్ గోరువెచ్చని నీటిలో వేసి క‌లియ‌బెట్టాలి. ఆ నీటిని పుక్కిలించాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే ఉప్పు యాంటిసెప్టిక్‌గా పనిచేసి గొంతును శుభ్రం చేసి నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తుంది. బీపి ఉన్నవాళ్లు ఈ పని చేయరాదు. 
 
వేడి నీటిలో కాస్త తేనె వేసి తీసుకుంటే గొంతునొప్పి నుంచి త్వర‌గా ఉపశమనం పొందవచ్చు. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి రోజూ తీసుకుంటే గొంతు సమస్యలు తొలగిపోతాయి. దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తింటే దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. మిరియాల పొడిని కాస్త తేనెలో కలిపి తినటం లేదా పాలల్లో మిరియాలపొడి కలిపి తాగినా గొంతు సమస్యలు తగ్గుతాయి. 
 
గొంతులో మంటగా ఉంటే వెల్లుల్లి రెబ్బను తింటే గొంతులో మంట తగ్గుతుంది. గొంతులో గరగర వంటి సమస్యలు పోవాలంటే ఉల్లిపాయ రసం సేవించడం లేదా అల్లంతో చేసిన టీ గాని, అల్లాన్ని నీటిలో ఉడికించి ఆ నీటిని గాని సేవిస్తే గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments