క్రిస్మస్ స్పెషల్: ఫ్రూట్ కేక్ తయారీ మీ కోసం..

జీసస్ పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్నవారికి సైతం పంపుతుంటారు. క్రిస్మస్ కేకులను

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (15:49 IST)
జీసస్ పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్నవారికి సైతం పంపుతుంటారు. క్రిస్మస్ కేకులను భారీగా షాపుల్లో కొనేసేవారు కొందరుంటే మరి కొందరు ఇంట్లోనే తయారు చేసుకుంటారు. అలాంటి వారు మీరైతే ఫ్రూట్ కేక్ ఎలా చేయాలో తెలుసుకోండి. 
 
కావలసిన పదార్థాలు :
ఎండు ద్రాక్ష - ఒకటిన్నర కప్పు 
ఖర్జూర పండ్లు - ఒకటిన్నర కప్పు 
జీడిపప్పు - అర కప్పు
జాజికాయ పొడి - అర టీ స్పూన్ 
బేకింగ్ పౌడర్ - ఒక టీ స్పూన్ 
వెన్నిలా ఎసెన్స్ - పది డ్రాప్స్ 
బటర్ - ఒక కప్పు 
పంచదార - ఒకటిన్నర కప్పు 
కోడిగుడ్లు - ఐదు 
మైదా - నాలుగు కప్పులు 
తేనె- అర కప్పు 
 
తయారీ విధానం:
ఎండు ద్రాక్షలను, ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీడిపప్పును పేస్ట్ చేసుకుని పక్కనబెట్టుకోవాలి. కోడిగుడ్డులోని తెల్ల, పసుపు సొనల్ని వేర్వేరుగా గిలకొట్టి పక్కనబెట్టుకోవాలి. పంచదార, వెన్నను బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తూ గిలకొట్టాలి.

ఈ మిశ్రమాలను మైదాపిండితో చేర్చి బాగా గిలకొట్టాలి. ముందుగా తెల్లసొన కలిపి గిలకొట్టాలి. ఆపై పసుపు సొనను చేర్చి గిలకొట్టాలి. ఆపై నట్స్‌ను అందులో చేర్చాలి. ఇందులో ఎసెన్స్, జాజికాయ పౌడర్ చేర్చుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన టిన్‌లలో ఉంచి బేక్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: మంగళగిరిలో 85వ ప్రజా దర్బార్‌... ఏపీ ఫైబర్‌నెట్ సేవ కింద..?

భీకరమైన బీభత్సం సృష్టించే క్షిపణులు సృష్టించా, ఇవి నా జీవిత కాలంలో ఉపయోగించలేనా? ఎవరు?

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పైపుల దగ్ధం - నిగ్గు తేల్చాలన్న సీఎం చంద్రబాబు

అన్నాడీఎంకే ఎన్నికల హామీలు : ఉచిత బంగారం - ఇంటికో ఫ్రిజ్ - పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం

పట్టెడన్నం కోసం జోరువానలో బారులు తీరిన చిన్నారు, ఈ ఆకలి కేకలు ఆగేదెన్నడు? video

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది

Kona Venkat: బ్యాండ్ మేళం నచ్చకపోతే ఇంకో సారి నా సినిమాని చూడకండి.: కోన వెంకట్

Atlee: అల్లు అర్జున్ AA22 సైన్ ఫిక్షన్ చిత్రం అప్ డేట్ తో అట్లీ

తర్వాతి కథనం
Show comments