Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల చామంతి పూవుతో పైల్స్‌కు చెక్.. ఎలా?

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (09:32 IST)
చాలా మందిని పైల్స్ సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు వైద్యులను సంప్రదిస్తుంటారు. నిజానికి పైల్స్ సమస్య థైరాయిడ్‌, డ‌యాబెటిస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, మాంసం, ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువ‌గా తిన‌డం, ఎక్కువ‌గా కూర్చుని ఉండ‌టం వల్ల వస్తుంది. ఈ స‌మస్య వచ్చే బాధ కూడా వర్ణనాతీతం. అలాంటి పైల్స్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు... 
 
* తెల్ల చామంతి పూవును తీసుకుని దాన్ని నీటిలో వేసి డికాక్ష‌న్ కాయాలి. ఆ డికాక్ష‌న్‌ను చ‌ల్లార్చి స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తే ఫ‌లితం ఉంటుంది.
 
* క‌ల‌బంద (అలోవెరా) ఆకుల‌ను తీసుకుని వాటిని మ‌ధ్య‌లోకి చీల్చి వాటి నుంచి గుజ్జును సేక‌రించాలి. దాన్ని పైల్స్‌పై అప్లై చేస్తే స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.
 
* చిన్న గ్లాస్‌లో కొద్దిగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ తీసుకుని అందులో కొన్ని కాట‌న్ బాల్స్ వేసి నాన‌బెట్టాలి. కొద్ది సేపు ఆగాక వాటిని తీసి స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తే పైల్స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
 
* ఒక నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండి అందులో కొద్దిగా అల్లం ర‌సం, తేనె క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పైల్స్‌పై రాయాలి. దీంతో వాటి నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌బిస్తుంది.
 
* కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను ఒక గిన్నెలో తీసుకుని అందులో కాట‌న్ బాల్స్ ముంచి స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాయాలి. దీంతో పైల్స్ బాధ నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఎక్కువ‌గా ఉన్నందున ఇది పైల్స్‌కు త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నంగా ప‌నిచేస్తుంది.
 
* టీ ట్రీ ఆయిల్‌ను ఆముదం లేదా బాదం నూనెతో క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పైల్స్‌పై రాస్తూ ఉండాలి. దీంతో కొద్ది రోజుల్లోనే పైల్స్ త‌గ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments