థైరాయిడ్ పేరు చెపితేనే జనం జంకుతుంటారు. ప్రతీ దానికి ఇబ్బందికర పరిస్థితి. థైరాయిడ్ వచ్చిందని ఒక్కసారి గుర్తిస్తే దాదాపుగా జీవితాంతం దాంతో సహజీవనం చేయాల్సిందే. తెల్లవారి లేచిందే మాత్రలు వేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కాస్తంత జాగ్రత్త తీసుకోవాలి.
థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోన్లు ఉత్పత్తి చేస్తే కణాలు అధిక శక్తిని వేగంగా ఉపయోగించుకొనేలా చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి తక్కువ స్ధాయిలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే శరీరములోని జీవకణాలు తక్కువ స్ధాయిలో శక్తిని ఉపయోగించి కణాలను విధి నిర్వహణ చేయునట్లు తోడ్పడతాయి. థైరాయిడ్ వ్యాధులు అన్ని వయస్సుల వారికి వస్తాయి. 5 నుండి 8 శాతం మంది స్త్రీలలో అధికంగా థైరాయిడ్ సమస్యలు ఉంటాయి.
చర్మము పొడి బారుతుంది. శబ్దంలో మార్పు వస్తుంది. శరీరం బరువు అధికమవుతుంది. కీళ్ళ వాపులు, నొప్పులు ఉంటాయి. నెలసరి రుతుక్రమంలో మార్పులు. మానసిక రుగ్మతలు వస్తుంటాయి. థైరాయిడ్ గ్రంధి పెద్దది అగుతాయి. శ్వాసకు సంబంధించిన, బి.పికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. మలబద్దకం ఉంటుంది.