Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవిశ గింజలతో చక్కెర వ్యాధికి చెక్

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (09:57 IST)
నేటి సమాజంలో మధుమేహం బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. చక్కెర వ్యాధి బారిన పడకుండా, ఒక వేళ ఇప్పటికే వచ్చినా సురక్షిత స్థాయుల్లో దాన్ని కట్టడి చేయాలంటే అనుసరించాల్సిన జీవనశైలిపై తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ గృహ విజ్ఞానశాస్త్ర విభాగం ఆచార్యులు, ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.శిరీష అధ్యయనం చేశారు. అవిశ గింజలు, పెరుగుతో మధుమేహాన్ని నియంత్రిస్తాయా అనే కోణంలో తమ పరిశోధన సాగించారు. 
 
మహిళా, ఎస్వీ యూనివర్సిటీలలో ఉన్న 100 మంది టైప్‌2 డయాబెటిక్‌ పేషెంట్లను 25 మంది చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి, మొదటి గ్రూపులో ఉన్నవారికి మూడు నెలలపాటు వంద మిల్లీగ్రాముల పెరుగునే ఇచ్చారు. రెండో గ్రూపునకు 25 గ్రాముల అవిశగింజలను అందించారు. మూడో గ్రూపునకు 100 మిల్లీ గ్రాముల చొప్పున పెరుగు, 25 గ్రాముల అవిశగింజలను ఇచ్చారు. నాలుగో గ్రూపునకు 100 మి.గ్రా. పెరుగు, అవిశగింజలు, ఒక గ్రాము స్పొరొలాక్‌ అందించారు. 
 
ఇలా మూడు నెలల పాటు ఈ ఆహారాన్ని ఇచ్చి తర్వాత అందరికీ షుగరు పరీక్ష చేశాం. కేవలం పెరుగు తీసుకున్న మొదటి 25 మందిలో మధుమేహ స్థాయి తగ్గలేదు. 25 గ్రాముల అవిశగింజలు తీసుకున్న రెండో గ్రూపు సభ్యుల్లో షుగర్‌ లెవెల్స్‌ తగ్గాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌తోపాటు బరువు కూడా తగ్గారు. పెరుగు, అవిశగింజలు, స్పొరొలాక్‌ తీసుకున్నవారిలో కూడా ఇదే ఫలితం వచ్చింది. 
 
"అవిశ గింజలను నేరుగా కాకుండా వేయించి ఉప్పునీళ్లు చల్లుకుని తింటే రుచిగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్‌ మన శరీరంలో ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. నేరుగా తినలేనివారు పొడిలా చేసుకుని అన్నంలో కలుపుకొని తినొచ్చు. వీటిని ప్రతిరోజూ తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది'' అని శిరీష వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాహుల్ జీ.. మీ సీఎం చూడండి.. బుల్డోజర్ రాజకీయాలు చేస్తుండు.. ఈ చిట్టి తల్లులకు (video)

గీన్ ఎనర్జీ హబ్‌గా రాయలసీమ - 750,000 మందికి ఉద్యోగాలు

ప్రాయశ్చిత్త దీక్ష.. అలిపిరి నుంచి పవన్ పాదయాత్ర.. 2 రోజులు కొండపైనే (video)

హైదరాబాదులో వాల్ పోస్టర్ల ట్రెండ్‌కు బైబై.. జీహెచ్ఎంసీ

అలిపిరి నుంచి తిరుమలకు కాలి నడకన బయలుదేరిన పవన్ కళ్యాణ్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా విడుదలయ్యాక వారం తర్వాత రివ్యూలపై రచ్చ?

ముంబై నటి జత్వానీ కేసు : ఐపీఎస్‌ల ముందస్తు బెయిల్ పిటిషన్లు

నాటి సినిమా హాలులు నేటి మల్లీప్లెక్స్ ల కబుర్లు

భేషుగ్గా రజనీకాంత్ ఆరోగ్యం : అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో దీక్ష చిత్రం

తర్వాతి కథనం
Show comments