Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలుబు చేసిందా.. అయితే ఇది తినండి...

వాము లేదా వామ్ము.. కేవలం వంటల్లోనే కాదు అనారోగ్యాలను తరిమి కొట్టడంలోనూ వాము ఉపయోగపడుతుంది. వాము వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, సువాసన వస్తుంది. అలాగే, ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది. వాట

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (12:25 IST)
వాము లేదా వామ్ము.. కేవలం వంటల్లోనే కాదు అనారోగ్యాలను తరిమి కొట్టడంలోనూ వాము ఉపయోగపడుతుంది. వాము వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, సువాసన వస్తుంది. అలాగే, ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది. వాటిని ఓసారి పరిశీలిద్ధాం. 
 
సాధారణంగా సీజన్ మారిందంటే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త వాతావరణం చాలా మందికి పడక జలుబు చేస్తుంది. దీన్ని వాముతో తగ్గించుకోవచ్చు. వామును ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా నలపాలి. అనంతరం ఆ పొడిని శుభ్రమైన వస్త్రంలో కట్టి దాన్ని వాసన పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తే జలుబు వెంటనే తగ్గుతుంది. 
 
ఒక టీస్పూన్ వామును ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని రోజూ తాగుతూ ఉంటే కిడ్నీలో రాళ్ల కరుగుతాయి. మూత్రాశయ సమస్యలు పోయి మూత్రం ధారాళంగా వస్తుంది. 
 
ఒక టీస్పూన్ వాము, ధనియాలు, జీలకర్రలను తీసుకుని మూడింటినీ కలిపి పెనంపై దోరగా వేయించాలి. అనంతరం ఆ మిశ్రమంతో కషాయం తయారు చేసుకోవాలి. దీన్ని తాగుతుంటే జ్వరం తగ్గుతుంది. 
 
వామును ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని బుగ్గన పెట్టుకుని నములుతూ వచ్చే రసాన్ని కొద్ది కొద్దిగా మింగాలి. దీంతో గొంతు నొప్పి తగ్గుతుంది. ఒక టీస్పూన్ మోతాదులో వామును తీసుకుని దానికి కొద్దిగా బెల్లం కలపాలి. ఆ మిశ్రమాన్ని సేవిస్తే ఆస్తమా తగ్గుతుంది. 
 
వామును నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో ఏదో ఒక రూపంలో తింటున్నా గుండె వ్యాధులు రాకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కడుపులో అసౌకర్యంగా ఉంటే కొద్దిగా వామును తినాలి. దీంతో జీర్ణాశయం సరిగ్గా పనిచేస్తుంది. ఆకలి బాగా పెరుగుతుంది. 

కేసీఆర్‌ కల చెదిరింది.. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం.. సీన్‌లోకి సోనియమ్మ

జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తుంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎన్నికల కౌంటింగ్.. బెట్టింగ్‌లు.. నరాలు తెగే ఉత్కంఠ.. గెలుపు ఎవరిదో..?

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

తర్వాతి కథనం
Show comments