Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనురెప్ప వాల్చకుండా గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్‌పై పనిచేస్తే కళ్లు దెబ్బతినవా?

రోజంతా కంప్యూటర్లకు అతుక్కుపోవడం, గంటల తరబడి టీవీల ముందు కూర్చోవడం, రెప్పవాల్చకుండా అదేపనిగా పనిచేయడం, కనీస విరామం లేకపోవడం వల్ల ఐటీ దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో నూటికి 40 శాతం మంది

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (07:15 IST)
రోజంతా కంప్యూటర్లకు అతుక్కుపోవడం, గంటల తరబడి టీవీల ముందు కూర్చోవడం, రెప్పవాల్చకుండా అదేపనిగా పనిచేయడం, కనీస విరామం లేకపోవడం వల్ల ఐటీ దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో నూటికి 40 శాతం మంది ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యుల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కళ్లు ఎరుపెక్కడం, కంట్లో నలుసు ఏర్పడటం, మంట, దురుద, తడారి పోవడం, నీరు కారడం, వంటి సమస్యలు కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

హైదరాాబాద్ నగరంలోని వాసన్, అగర్వాల్, ఎల్వీప్రసాద్, సరోజినీదేవి, మ్యాక్స్‌విజన్ తదితర కంటి ఆస్పత్రుల్లో ప్రతి రోజూ 400కు పైగా కేసు లు నమోదు అవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో కంటి చూపు దెబ్బతినే అవకాశమూ లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో మూడు లక్షల మందికి పైనే పనిచేస్తున్నట్లు ఓ అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కంప్యూటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. కనురెప్ప వాల్చకుండా గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్‌పై పనిచేస్తుండటం వల్ల కళ్లు దెబ్బ తింటున్నాయి. ఐటీ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి వంద మందిలో 40 శాతం ఏదో ఒక కంటి సమస్యతో బాధపడుతున్నారని ప్రముఖ కంటి వైద్యుడు సుధాకర్‌రెడ్డి తెలిపారు.

కంటిపై పెరుగుతున్న ఒత్తిడివల్ల తీవ్రమైన ఇరిటేషన్‌కు గురవుతున్నారు. ప్రతి చిన్న అంశానికి చిరాకు పడుతున్నారు. ఇక పిల్లలు గేమ్స్ అంటూ కంప్యూర్లకు అతుక్కపోతున్నారు. గంటల తరబడి టీవీలను వీక్షిస్తుండంతో చూపు మందగించి పుస్తకంలోని అక్షరాలను కూడా చదువలేకపోతున్నారు.
 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

తర్వాతి కథనం
Show comments