Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగువ‌తో అద్భుత‌మైన ఉప‌యోగాలు..!

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (09:52 IST)
ఇంగువ‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. దీన్ని అనేక వంట‌ల్లో చాలా మంది వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చక్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. ఇంగువ వేసి వండిన ప‌దార్థాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇంగువ వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అవేమిటంటే…
 
1. ఇంగువ‌ను ఆహారాల్లో తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, పేగుల్లో పురుగులు, ఇర్రిట‌బుల్ బౌల్ సిండ్రోమ్‌, అజీర్ణం, క‌డుపునొప్పి, క‌డుపు ఉబ్బ‌రంగా ఉండ‌డం, మ‌ల‌బ‌ద్ద‌కం, డ‌యేరియా, అల్స‌ర్లు వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.
 
2. ఇంగువ‌లో యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి క‌లుగుతుంది. శ‌రీరంలో అధికంగా ఉండే మ్యూక‌స్ క‌రుగుతుంది. దీంతోపాటు బాక్టీరియా ఇత‌ర సూక్ష్మ‌క్రిములు న‌శిస్తాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బ్రాంకైటిస్‌, ఆస్త‌మా, కోరింత ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఇంగువ ఎంత‌గానో మేలు చేస్తుంది.
 
3.ఇంగువ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌కు వారి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. రుతు స‌మ‌యంలో అధికంగా ర‌క్త‌స్రావం కాకుండా ఉంటుంది. అలాగే సంతాన లోపం, ముందుగానే ప్ర‌స‌వ నొప్పులు రావ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.
 
4.  దంతాలు, చెవుల నొప్పి ఉన్న‌వారికి ఇంగువ ఎంత‌గానో మేలు చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఇంగువ‌ను క‌లిపి నోట్లో ఆ నీరు పోసి బాగా పుక్కిలిస్తే దంతాల నొప్పి త‌గ్గుతుంది. అలాగే కొబ్బ‌రినూనె, ఇంగువ‌ను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రెండు చుక్క‌ల మోతాదులో చెవుల్లో వేస్తే చెవి నొప్పి త‌గ్గుతుంది. ఇంగువ‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 యేళ్ల తర్వాత పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారు : నారా లోకేశ్

Pulivendula: పులివెందుల ప్రజలు భయాన్ని వదిలించుకున్నారు.. జగన్ భయపడుతున్నారు

పులివెందులకు పూర్వవైభవం వచ్చింది : ఎమ్మెల్యే బాలకృష్ణ

పులివెందులలోనే కాదు.. ఒంటిమిట్టలోనూ టీడీపీ జయకేతనం

అహంకారంతో ఉన్న జగన్‌ను ఆకాశం నుంచి కిందికి దించాం : బీటెక్ రవి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

తర్వాతి కథనం
Show comments