Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఔషధం…జామ కాయ

చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఔషధం…జామ కాయ
, సోమవారం, 18 అక్టోబరు 2021 (08:22 IST)
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏ రోగాలతో అత్యధికంగా చనిపోతున్నారు అనే విషయాలని ఎన్నో సార్లు వెల్లడించింది. అందులో ముఖ్యంగా గుండె సంభందిత వ్యాధులతో అత్యధికంగా ప్రజలు చనిపోతుంటే..రెండవ స్థానం మాత్రం చెక్కెర వ్యాధితో ప్రజలు చనిపోతున్నారని తేల్చి చెప్పింది.

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి తీవ్ర రూపం దాల్చిందని దీని ప్రభావానికి చిన్న పిల్లలు సైతం లోనవుతున్నారని తెలిపింది. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఈ షుగర్ లెవిల్స్ కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు..మరి షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడం ఎలా?
 
- షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడానికి జామకాయలు ఎంతగానో ఉపయోగ పడుతాయి.
 
వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. జామకాయలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవిల్స్ ని చెక్ చేస్తుంది. జామాలో ఉండే గ్లికామిక్ ఇండెక్స్ తొందరగా అరగనివ్వవు. దాంతో రక్తం లో గ్లూకోజ్ లెవిల్స్ ఒక్క సారిగా పెరగకుండా ఉంటాయి. ఫలితంగా బ్లడ్ లో లెవిల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అందుకే వైద్యులు డయాబెటిస్ రోగులకి జామకాయలు ఎక్కువగా తీసుకోమని సూచిస్తారు.. 
 
అంతేకాదు బరువు తగ్గాలని అనుకునే వారు కూడా జామకాయ తినవచ్చు ఎందుకంటె జామకాయలో కేలరీస్ తక్కువగా ఉంటాయి. అత్యధిక బరువు ఉన్న వారికి కూడా షుగర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా కాబట్టి జామ కాయ తినడం ద్వారా బరువు తగ్గి వివిధ వ్యాధుల నుంచీ కాపాడుకోవచ్చు. షుగర్ ని కంట్రోల్ లో ఉంచడానికి సోడియం, పొటాషియం రెండూ కావాలి ఈ రెండు జామకాయలో పుష్కలంగా లభిస్తాయి.

“సి” విటమిన్ కోసం అందరూ నిమ్మకాయ, నారింజ తినాలని అంటారు..కానీ జామకాయలో “సి విటమిన్” నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారికి రోగ నిరోధక శక్తి అధికంగా ఉండాలి. జామాలో రోగ నిరోధక శక్తిని అందించే కారకాలు లెక్కకి మించే ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?