Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లియోపాత్రనే మెప్పించిన కలబంద.. ఆరు వేల సంవత్సరాలుగా మనిషికి ఉత్తమ సేవ

గ్రామాల్లో పొలాల గట్లపై, వాగుల్లో, బంజరభూముల్లో కలబంద విస్తారంగా పెరుగుతోంది. తొలుత ఈ మొక్కలను పిచ్చిమొక్కలుగా వదిలివేసిన ప్రజలు నేడు వాటి విలువ తెలుసుకొని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ఇతర దేశాల

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (07:49 IST)
గ్రామాల్లో పొలాల గట్లపై, వాగుల్లో, బంజరభూముల్లో కలబంద విస్తారంగా పెరుగుతోంది. తొలుత ఈ మొక్కలను పిచ్చిమొక్కలుగా వదిలివేసిన ప్రజలు నేడు వాటి విలువ తెలుసుకొని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ఇతర దేశాలలో కలబందకున్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌, చెన్నై, ముంబైవంటి పట్టణాల నుంచి వ్యాపారులు వచ్చి వీటిని కొనుగొలు చేస్తుండటంతో ప్రజలు వీటి పెంపకంపట్ల ఆసక్తి చూపుతున్నారు.
 
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి సిద్ధ ఔషధాలపై ఏర్పడిన ఆసక్తి వలన కలబందలోవున్న లక్షణాల ఆధారంగా ఎన్నో రకాల ఔషధ, చర్మ రక్షణ, సౌందర్య పరిరక్షణ ఉత్పత్తులను తయారు చేయడానికి కృషిచేసి సఫలీకతులయ్యారు శాస్తజ్ఞ్రులు. ఇరాన్‌, ఈజిప్టు, గ్రీకు దేశాలలో పురాతన కాలంలోనే కలబందను నిత్యజీవితంతో భాగంగా పరిగణించి వినియోగించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. హిందు మతానికి మూలమైన వేదాలలో, క్రైస్తవ గ్రంథమైన బైబిల్‌లో కలబందను ప్రస్తావించారు. క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దంలో అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ యుద్ధంలో గాయపడిన సైనికులు గాయాలపై దీనిని వాడినట్లు వున్నాయి.
 
ఈజిప్టురాణి క్లియోపాత్ర తమ చర్మాన్ని మృదువుగా, అందంగా వుండటానికి దీనిని వాడినట్లు చరిత్ర చెబుతోంది. అలోవెరాని జూస్‌గా తాగటం వల్ల దీర్ఘకాలం ఆరోగ్యంగా వుండవచ్చునని అంటున్నారు. ఇందులో 15 రకాల పోషక పదార్ధాలు మిళితమై మానవ శక్తిని ప్రసాదిస్తాయి. ఎక్కువ సల్ఫర్‌ కలిగివుండే వెల్లుల్లి జాతికి చెందిన కలబంద ఆరు వేల సంవత్సరాల క్రితం నుంచే మానవ జాతికి ఎంతో ఉత్తమ సేవలను అందిస్తున్నది. దీనిలోవుండే 200లకుపైగా చురుకైన మూలకాలు మానవ శరీర ఆరోగ్యానికి సహాయపడతాయి.
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments