మెంతులతో ఆ సమస్యలు నివారించుకోవచ్చు...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (19:42 IST)
సాధారణంగా ప్రతి ఒక్కరు  పచ్చళ్లలో, వంటకాలలో మెంతులను వాడుతూ ఉంటారు. ఇవి కేవలం వంటలలోనే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మెంతులు తలపై భాగాన వేడిని తగ్గిస్తాయి. చుండ్రు నివారిస్తాయి, వెంట్రుకలను బిరుసుగా వుంచుతాయి. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. 
 
జుట్టును సున్నితంగా, మెత్తగా ఉంచుతాయి. కళ్ళకు, మెదడుకు చల్లదనాన్ని కలిగిస్తాయి.  మెంతులు నికోటినిక్ యాసిడ్ మరియు ప్రోటీన్ ను కేశాలకు పుష్కలంగా అందేలా చేస్తాయి. ఇది కేశాలు తిరిగి పెరగడానికి మరియు బలంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతాయి. మెంతులు మరియు మెంతి ఆకులను ఉపయోగించి అనేక జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు. మెంతుల వలన కలిగే ప్రయోజనమేమిటో వివరంగా తెలుసుకుందాం.
 
1. మెంతుల్ని రాత్రంతా నానబెట్టి, ఉదయం బాగా మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయడం వల్ల కేశాలకు మంచి మెరుపు, బలం చేకూరుతుంది. చుండ్రును మాయం చేస్తుంది. జుట్టు ఊడిపోకుండా ఎనర్జీ అందిస్తుంది.
 
2. మెంతులను నీళ్ళలో వేసి బాగా ఉడికించాలి. తర్వాత ఆ నీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత తలకు పోసుకోవడం వల్ల జుట్టుకు కావల్సిన శక్తి అంది జుట్టు పాడైపోకుండా కాపాడుతుంది.
 
3. నీళ్ళలో మెంతి ఆకులను వేసి బాగా ఉడికించాలి. ఈ ఆకులను నీటినుండి వేరుచేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి పెరుగు కలిపి. తలకు జుట్టుకు బాగా పట్టించాలి. తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వలన జుట్టు పొడిబారడం, చుండ్రు వంటి జుట్టు సమస్యలు నివారించబడతాయి.
 
4. మెంతులను మరియు ఉసిరిని కలపి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం, పెరుగు పట్టించి పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
5. మెంతుల్లోని మాంసకృత్తులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. కుదుళ్లకు పోషణనిచ్చి వెంట్రుకల చివర్లు చిట్లకుండా అడ్డుకుంటాయి. మెంతులు నానబెట్టిన నీటితో జుట్టును కడుక్కోవడం వల్ల మెంతుల్లో ఉండే పొటాషియం జుట్టు తెల్లగా అవ్వడాన్ని నిరోధిస్తుంది
 
6. పావు కప్పు కొబ్బరినూనె లేదా ఆలివ్‌ నూనెలో అరచెంచా మెంతులు వేసి కొన్ని గంటల పాటూ నానబెట్టాలి. ఈ నూనెను తలకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. 
 
7. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మెంతులు ఎంతో ఉపకరిస్తాయి. రెండు చెంచాల నానబెట్టిన మెంతులూ, గుప్పెడు తాజా కరివేపాకును ముద్దలా చేసుకోవాలి. దీన్ని క్రమంతప్పకుండా జుట్టుకు పట్టించడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

తర్వాతి కథనం
Show comments