ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం, సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చిన్న పెద్ద వయసు సంబంధం లేకుండా అనేక రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుత్తున్నాయి. ఈ సమస్యలని అధిగమించడానికి సహజసిద్ధంగా లభించే ఆహార పదార్దాలని మనం తినే ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది. నల్లనువ్వులు అనేక రకములైన ఆరోగ్య సమస్యలకి మంచి ఔషధంలా పని చేస్తుంది. మరి దీనిలోని పోషకాలేంటో తెలుసుకుందాం.
1. నువ్వులు, బెల్లం కలిపి ఉండలుగా చేసుకుని ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్, కాల్షియం లభిస్తుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు వీటిని పెట్టడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
2. చాలా మందికి విటమిన్-బి, ఐరన్ లోపం కారణంగానే జుట్టు ఊడిపోవడం, తెల్లబడడం, జ్ఞాపకశక్తి లోపించడం జరుగుతుంటుంది. ఇవి రెండూ నల్ల నువ్వుల్లో పుష్కలంగా దొరుకుతాయి. వీటిల్లోని విటమిన్-ఇ చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది.
3. నల్ల నువ్వులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయట. వీటిల్లని పీచు లిగ్నన్లూ, పైటోస్టెరాల్ వంటి పేగు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. నువ్వుల్లోని సిసేమిన్ కాలేయం దెబ్బ తినకుండా కాపాడుతుంది.
4. నల్ల నువ్వుల్లో అధికంగా ఉండే పీచూ అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి అంటున్నారు భారతీయ వైద్యులు. వీటిల్లోని నూనె పేగు పొడిబారిపోకుండా చేస్తుందట. వీటిని రుబ్బి లేదా నానబెట్టి తీసుకోవడం వల్ల పేగులోని నులిపురుగులుని బయటకు పంపించడంతో పాటు జీర్ణక్రియకు దోహదపడతాయి.
5. వీటిల్లో అధికంగా ఉండే మెగ్నీషియం బీపీని తగ్గిస్తుంది. కొలస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది.
6. సాధారణంగా ఆడవారిలో ముప్పై ఐదేళ్లు పైబడ్డాక ఎముక బరువు క్రమంగా తగ్గుతుంది. మెనోపాజ్ సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువ. అందుకే కాల్షియం, జింక్ ఎక్కువగా ఉండే నల్లనువ్వులను ఆహారంలో భాగంగా తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. నల్ల నువ్వులు పాలిచ్చే తల్లులకు ఎంతో మంచివి అంటున్నారు పోషకాహార నిపుణులు.