Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డీవీ
బుధవారం, 15 మే 2024 (13:18 IST)
The Lord of the Rings: The Rings of Power
నేడు ప్రైమ్ వీడియో తన రాబోయే  హిట్ సీరీస్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ యొక్క రెండవ సీజన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసినప్పుడు న్యూయార్క్ నగరములో అమెజాన్ యొక్క ప్రారంభోత్సవ ముందస్తు ప్రదర్శనకు హాజరు అయినవారు తిరిగి మిడిల్-ఎర్త్ కు తిరిగి పంపించబడ్డారు. ఈ సీరీస్ మొదటి సీజన్ ఊహించని ప్రపంచవ్యాప్త విజయం సాధించింది మరియు ప్రైమ్ వీడియో కొరకు ఉత్తమ ఒరిజినల్ సీరీస్ లో ఒకటిగా నిలిచి, ప్రపంచము అంతటా 100 మిలియన్ లకు పైగా ప్రేక్షకులచే వీక్షించబడింది మరియు ఈనాటి వరకు ఇతర కంటెంట్ కంటే దీని ప్రారంభ విండో సమయములో ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ సైన్-అప్స్ ఎక్కువగా జరిగాయి.
 
సీజన్ రెండు ప్రపంచవ్యాప్తంగా గురువారం, ఆగస్ట్ 29, 2024 నాడు 240 లకు పైగా దేశాలు మరియు భూభాగాలలో అనేక భాషలలో తొలిసారి ప్రసారం అవుతుందని ప్రైమ్ వీడియో ప్రకటించింది.
 
 ఈరోజు ప్రపంచములోనే అతిపెద్ద సాహిత్య విలన్లలో ఒకరైన సౌరాన్ మిడిల్-ఎర్త్ కాపురస్థులను మోసగించుటలో తనకు సహాయం చేసే ఒక కొత్త రూపములో కనిపిస్తారు. ఈ పాత్రలో చార్లీ వికర్స్ మళ్ళీ నటించిన అద్భుతమైన సీజన్ రెండు కీ ఆర్ట్ కూడా విడుదల చేయబడింది.
 
డెబ్యూ టీజర్ ట్రెయిలర్ ప్రేక్షకులను జే.ఆర్.ఆర్. టోల్కీన్ యొక్క సెకండ్-ఏజ్ కు తిరిగి ఒక యాక్షన్-ప్యాక్డ్ ప్రయాణములోకి తీసుకెళ్తుంది మరియు సంపూర్ణ అధికారము కొరకు తన ప్రతీకార అన్వేషణను కొనసాగించడముతో సౌరాన్ యొక్క పెరిగే చెడు ఉనికి చూపుతుంది. ఈ సీరీస్ ప్రసిద్ధి చెందిన సినిమా వైభవాన్ని చూపుతూ మరియు గాలాడ్రీల్, ఎల్రాండ్, ప్రిన్స్ డ్యూరిన్ ఐవి, అరోండిర్ మరియు సెలెబ్రింబోర్ తో సహా ఫ్యాన్స్ కు ఇష్టమైన అనేక పాత్రలు తిరిగి రావడాన్ని ప్రకటిస్తూ, ఈ ఫస్ట్-లుక్ మరిన్ని రింగ్స్ యొక్క ఎంతగానో-ఎదురుచూడబడుతున్న సృష్టిని కూడా వెల్లడిస్తుంది.
 
ది రింగ్స్ ఆఫ్ పవర్ యొక్క సీజన్ రెండులో, సౌరాన్ తిరిగి వచ్చాడు. గాలాడ్రీల్ చే బయటకు నెట్టివేయబడి, సైన్యము లేదా మిత్రుడు లేకుండా, పెరుగుతున్న చీకటి ప్రభువు ఇప్పుడు తన బలాన్ని పునర్నిర్మించుకొనుటకు తన సొంత చాకచక్యం పైనే ఆధారపడవలసి ఉంటుంది మరియు రింగ్స్ ఆఫ్ పవర్ యొక్క సృష్టిని పర్యవేక్షించాలి, ఇది మిడిల్-ఎర్త్ యొక్క ప్రజలందర్నిని తన చెడు సంకల్పానికి కట్టిపడేసే వీలు కలిగిస్తుంది. సీజన్ ఒకటి ఐతిహాసిక పరిధి మరియు ఆశయం పై నిర్మించబడి, ఈ కొత్త సీజన్ తన ప్రియమైన మరియు హాని కలిగించే పాత్రలను ఉవ్వెత్తున ఎగసే చీకటి అలల్లోకి తోస్తూ, ప్రతి ఒక్కరిని విపత్తు అంచులలో ఉండే ఒక ప్రపంచములో తమ స్థానాన్ని కనుక్కునే సవాలు విస్తురుతుంది. దయాలు మరియు మరుగుజ్జులు, ఆర్క్స్ మరియు పురుషులు, తాంత్రికులు మరియు హార్పుట్స్…స్నేహాలు కృత్రిమమై, రాజ్యాలు పగులుబారుతుండగా, మంచి శక్తులు తమకు కావలసిన అంశాలపై నిలిచి ఉండేందుకు మరింత పరక్రమంగా పోరాడుతారు….ఒకరితో ఒకరు.
 
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ అఫ్ పవర్ సీజన్ రెండు ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో ప్రైమ్ వీడియో పై ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments