మా ఆయన నాకోసం పూలు తెచ్చారు... మురిసిపోయిన ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అంటే ఆయన సతీమణి ఉపాసనకు ఎక్కడలేని ఇష్టం. అందుకే ఎపుడు సమయం, సందర్భం వస్తే చాలు.. తన భర్తను ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇందుకోసం ఆమె సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటుంది.

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (11:43 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అంటే ఆయన సతీమణి ఉపాసనకు ఎక్కడలేని ఇష్టం. అందుకే ఎపుడు సమయం, సందర్భం వస్తే చాలు.. తన భర్తను ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇందుకోసం ఆమె సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటుంది. తాజాగా తన భర్త మిస్టర్ సి పై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉపాసన ట్వీట్ చేసింది. మిస్టర్ సి తన కోసం పూల బొకేను కొని తెచ్చారంటూ మురిసిపోయింది.
 
దీనికి సంబంధించి షాపింగ్ చేసి వస్తున్న హీరో రామ్ చరణ్ ఫొటోను షేర్ చేసి, తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఉపాసన. ఈ చిత్రంలో చరణ్ కారులో ఎంతో జాగ్రత్తగా ఓ బొకేను పొదివి పట్టుకుని కూర్చున్నట్టు కనిపిస్తుండగా, ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు, భార్య పట్ల రామ్ చరణ్‌కు ఉన్న ప్రేమకు ఈ ఫొటో నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. 
 
కాగా, రామ్ చరణ్ ఎంతో అమాయకంగా, క్యూట్‌గా కనిపిస్తున్నారని, స్వచ్ఛమైన ప్రకృతికి సాక్ష్యంగా నిలిచే పూలు ఆయన చేతిలో క్షేమంగా ఉన్నాయని అంటున్నారు. ఈ పిక్ చూస్తుంటే అన్నయ్యకు ఉపాసనంటే ఎంత ఇష్టమో ఇట్టే తెలిసిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంమీద తన భర్త చేసిన పనికి భార్యగా మురిసిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments