అవతార్‌-2 2021 డిసెంబర్ 17న విడుదల.. అవతార్ సిరీస్ కొనసాగుతాయ్!

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (10:51 IST)
Avatar 2
''అవతార్'' హాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన సంగతి తెలిసిందే. కెనడియన్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌, స్క్రీన్‌రైటర్‌ జేమ్స్‌ కామెరూన్‌ ఇప్పటివరకు 33 సినిమాలు తీయగా అందులో 'అవతార్‌' ఆయనకు మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. ఈ సినిమా సీక్వెల్స్‌కి సంబంధించి కొన్నాళ్ళుగా పనులు జరుగుతుండగా, కరోనా వలన మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. ఇటీవల న్యూజిలాండ్ మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టారు.
 
ఈ నేపథ్యంలో అవతార్‌-2 సినిమాను 2021 డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్టు ఇదివరకే జేమ్స్‌ కామెరూన్‌ ప్రకటించారు. అవతార్‌-2తో సీక్వెల్‌ ప్రయాణాన్ని ముగించకుండా అవతార్‌-3, అవతార్‌-4, అవతార్ 5 సినిమాలు కూడా నిర్మించాలని కూడా భావిస్తున్నట్టు వెల్లడించారు జేమ్స్‌ కామెరూన్‌. తాజాగా డిస్నీ సంస్థ అవతార్ సీక్వెల్స్‌కి సంబంధించిన రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. 
 
అవతార్ 2 చిత్రం ముందుగా 2021 డిసెంబర్ 17న విడుదల అవుతుందని ప్రకటించగా, తాజాగా ఏడాది వాయిదా వేస్తూ డిసెంబర్ 16, 2022న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక అవతార్ 3 చిత్రం డిసెంబర్ 20, 2024న అవతార్ 4 చిత్రం డిసెంబర్ 18, 2026న, అవతార్ 5 చిత్రం డిసెంబర్ 22, 2028న రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments