Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత : టిటిడి ఈవో

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (21:27 IST)
చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని మంగ‌ళ‌వారం రాత్రి 7 గంటలకు మూసివేసినట్టు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆలయం తలుపులు మూసివేసిన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు.
 
ఈవో మాట్లాడుతూ బుధ‌వారం ఉద‌యాత్పూర్వం 1.31 నుండి 4.29 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్ర‌హ‌ణం ఉంటుంద‌ని, గ్ర‌హ‌ణ స‌మ‌యానికి 6 గంట‌లు ముందుగా శ్రీ‌వారి ఆల‌యాన్ని మూసివేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని అన్నారు. ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు 37,144 మంది భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నార‌ని తెలిపారు. అన్న‌ప్ర‌సాద భ‌వ‌నాన్ని కూడా మూసివేశామ‌ని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు దాదాపు 20 వేల మంది భ‌క్తుల‌కు పులిహోర‌, ట‌మోటా రైస్ ప్యాకెట్లు అందించామ‌ని వివ‌రించారు.

బుధ‌వారం ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారని చెప్పారు. ఉదయం సుప్రభాతం, తోమాలసేవ ఏకాంతంగా నిర్వ‌హిస్తామ‌ని, అనంతరం ఉదయం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు ఆణివార ఆస్థానం ఆగ‌మోక్తంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఆ త‌రువాత భ‌క్తుల‌కు సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు భ‌క్తులు బాగా స‌హ‌క‌రించార‌ని, రేపు కూడా ద‌ర్శ‌న స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డంతో భ‌క్తులు సహ‌క‌రించాల‌ని కోరారు.
 
ఈవో వెంట టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి ఇతర అధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments