గణపతి తులసిని ఇష్టపడడట.. ఎందుకో తెలుసా..?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (12:26 IST)
తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి తులసిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. గరిక దగ్గర నుండి అన్ని రకాల అడవిపూలు... ఆకులు గణపతి పూజకు వాడుతున్నప్పుడు, తులసిని ఎందుకు వాడకూడదనే సందేహం రావడం సహజమే. ఐతే ఇది చదవండి. వినాయకుడిని చూసిన ధర్మధ్వజ యువరాణి, ఆయన శక్తి సామర్ధ్యాలను గురించి తెలుసుకుంది.
 
వినాయకుడిని మోహించి తనని వివాహం చేసుకోమంటూ ప్రాధేయపడింది. అందుకు వినాయకుడు ససేమిరా అంగీకరించకపోవడం ఆమెకి ఆగ్రహావేశాలను కలిగించింది. దాంతో బ్రహ్మచారిగానే ఉండిపొమ్మంటూ శపించింది. అందచందాలను కోల్పోయి అసురులతో కలిసి జీవించమని వినాయకుడు ప్రతి శాపమిచ్చాడు.
 
దాంతో తన తొందరపాటును మన్నించమంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుని, శాపకాలాన్ని తగ్గించమని కోరింది. దాంతో కొంతకాలంపాటు రాక్షసులతో కలిసి జీవించాక, తులసిగా జన్మిస్తావంటూ వినాయకుడు ఉపశమనాన్ని కలిగించాడు. తనని శపించిన ఆమె అవతారమే తులసి కావడం వలన తన పూజలో తులసిని వాడడం వినాయకుడు ఇష్టపడడని ఆధ్యాత్మిక గ్రంధాలు తెలుపుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు

మహిళా ఐఏఎస్ అధికారులను కించపరిచిన వారిపై కఠిన చర్యలు : పొన్నం ప్రభాకర్

జగనన్న ప్రభుత్వం వస్తే రప్పా రప్పా నరికేస్తాం.. ఇంటి పునాదులు కూడా లేకుండా పెకలిస్తాం...

కొన ఊపిరితో ఉన్న కన్నతల్లిని బస్టాండులో వదిలేసిన కుమార్తె

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

అన్నీ చూడండి

లేటెస్ట్

భోగి పండుగ రోజున వేరు శెనగలు, మొక్కజొన్న, నువ్వులు, బెల్లం మంటల్లో సమర్పిస్తే..?

13-01-2026 మంగళవారం ఫలితాలు - రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి..

2026లో రాశుల వారీగా ఫలితాలు- పరిహారాలు క్లుప్తంగా...

Makar Sankranti 2026 astrology: సంక్రాంతి రోజున రాజయోగం.. ఈ రాశులకు అదృష్టం

భోగి, మకర సంక్రాంతి, కనుమలకు ప్రత్యేకంగా ఏమి చేస్తారు?

తర్వాతి కథనం
Show comments