Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లో బంగాళాదుంప చెట్టును నాటడం ఎలా..?

Advertiesment
potato
నేటి తరుణంలో బయట దొరికే కూరగాయలు కొనాలంటే భయంగా ఉంది. ఎందుకంటే.. ఇప్పుడు అమ్మే కూరగాయాలు గానీ, పండ్లు గానీ, కెమికల్స్‌తోనే పండిస్తున్నారు. కెమికల్స్‌‍తో తయారుచేసినవి తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్తున్నారు.

ఇంకా చెప్పాలంటే బంగాళాదుంప అంటే నచ్చని వారుండరు. కానీ, ఇప్పుడు వచ్చే వాటిని తినాలంటే.. ఏదో తెలియని ఆందోళనగా ఉంటుంది. అందుకు పరిష్కార మార్గం.. మనం ఇంట్లోనే బంగాళాదుంప చెట్టును పెంచుకోవడమే.. మరి ఎలా పెంచాలో తెలుసుకుందాం... 
 
ముందుగా ఓ పెద్ద బకెట్ లాంటిది తీసుకుని దానికి మధ్య మధ్యలో అంటే.. కత్తితో చతురస్రాకారంలో నాలుగు భాగాల గ్యాప్ వచ్చేలా కోయ్యాలి. ఆపై అదేలాంటి మరో బకెట్ తీసి అందులో ముందుగా కోసి పెట్టుకున్న బకెట్‌ను పెట్టాలి. ఆ తరువాత ఆ బకెట్లో కొద్దిగా మట్టి వేసి మొలకెత్తిన బంగాళాదుంపలు వేయాలి.
 
తరువాత మళ్లీ వాటిపై మట్టి వేసి నీళ్లు పోయాలి. ఇలా వేస్తూ వేస్తూ బకెట్ నిండే వరకు మట్టిని నింపి నీరు పోయాలి. ఇలా 3 నెలల పాటు నీళ్లు పోస్తూ ఉండాలి. ఆ తరువాత కట్ చేసిన బకెట్‌ని మాత్రం బయటకు తియ్యాలి. ఆపై.. దాన్ని ఓ పక్కన పెట్టి కింద భాగంలో చూడండి.. బంగాళాదుంపలు వచ్చుంటాయి. బయట దొరికే వాటిని వాడడం కంటే ఇంట్లో పెంచుకుని వాడుకోవడం ఎంతో మంచిది. ఇలా చేసి చూడండి.. తప్పక ఫలితం ఉంటుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ లేని జీవితం...?