Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు వాడే సబ్బు నాణ్యమైనదేనా...?! ప్యాకింగ్ చూసి తెలుసుకోండి ఇలా...

మ‌నం ఫ్రెష్‌గా ఉండాలంటే... స్నానం చేయాల్సిందే. ప్రతిరోజు మనం తప్పకుండా చేసే పని స్నానం ఒకటి, స్నానం చేయాలంటే ఖచ్చితంగా సబ్బు లేదా బాడీ వాష్ ఉండాల్సిందే, శరీరం మంచిగా ఉండాలంటే రోజుకి కనీసం రెండుసార్లయినా స్నానం చేయాలి. అయితే రెండుసార్లు కాకున్నా ఒకసార

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (16:31 IST)
మ‌నం ఫ్రెష్‌గా ఉండాలంటే... స్నానం చేయాల్సిందే. ప్రతిరోజు మనం తప్పకుండా చేసే పని స్నానం ఒకటి, స్నానం చేయాలంటే ఖచ్చితంగా సబ్బు లేదా బాడీ వాష్ ఉండాల్సిందే, శరీరం మంచిగా ఉండాలంటే రోజుకి కనీసం రెండుసార్లయినా స్నానం చేయాలి. అయితే రెండుసార్లు కాకున్నా ఒకసారి చేసినా శరీరాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణంగా ఎక్కువమంది స్నానం చేయడానికి వివిధ రకాల సబ్బులని ఉపయోగిస్తారు.

చాలామంది సబ్బులని టీవీలలో వచ్చే యాడ్స్ చూసి, సబ్బుల నుండి వచ్చే సువాసనను చూసి కొంటారు. కాని మార్కెట్లో ఉండే సబ్బులలో 70% సబ్బులు మన శరీరానికి హాని చేసేవే. కేవలం లాభాల కోసం మాత్రమే మా సబ్బులో అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని ఇంకా ఆఫర్స్ కూడా ఇస్తాయి. సబ్బుల యొక్క నాణ్యతని నిర్ణయించడానికి టీఎఫ్‌ఎం అనే పదం ఉపయోగపడుతుంది.
 
మీరు వాడుతున్న సబ్బు ప్యాకింగ్‌ను ఒక్కసారి సరిగ్గా గమనించండి. దానిపై టీఎఫ్‌ఎం 70 శాతం, 67 శాతం, 82 శాతం అని రాసుందా? ఆ అదే! ఇప్పుడదే సబ్బు నాణ్యతను ధ్రువీకరిస్తుంది. అసలు టీఎఫ్‌ఎం అంటే ఏమిటి? టీఎఫ్‌ఎం (TFM) అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. అంటే ఈ టీఎఫ్‌ఎం శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యమైన గుణాలను కలిగి ఉంటుందని అర్థం. భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) ప్రకారం సబ్బులను 3 రకాలుగా విభజించారు.
 
అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. 76 అంతకు మించి శాతం ఉన్నవి గ్రేడ్ 1 సబ్బులు. 70 నుంచి 75 వరకు టీఎఫ్‌ఎం ఉంటే అవి గ్రేడ్ 2 సబ్బులు. 60 నుంచి 70 శాతం మధ్యలో టీఎఫ్‌ఎం ఉన్నవి గ్రేడ్ 3 సబ్బులు. గ్రేడ్ 2, 3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి. ఇవి సబ్బు రూపంలో మామూలుగానే కనిపిస్తాయి. కాకపోతే వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్బుల్లో ఆస్బెస్టాస్ వంటి రసాయనాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని వాడితే చర్మానికి హాని కలుగుతుంది. గ్రేడ్ 2,3 సబ్బులు నీటిలో కలిసిప్పుడు మెత్తగా అయిపోయి చాలా త్వరగా అరిగిపోతాయి. నురగ ఎక్కువ వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి. 
 
ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే మంచిది. ఎందుకంటే ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి. దీంతోపాటు అధిక శుభ్రతను కలగజేస్తాయి. అదనపు కెమికల్స్ లేకుండానే సువాసనను ఇస్తాయి. కనుక ఇప్పటి నుండి అయినా సబ్బుల యాడ్స్‌ని లేదా సువాసనని కాకుండా సబ్బు ప్యాకెట్ పైన ఉన్న TFM శాతాన్ని చూసి కొనుక్కోండి.

వెబ్ దునియా తెలుగు వార్తలు, మరిన్ని విశేషాలు పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

'యోగా' అంటే ఏంటి? ఆర్కే బీచ్‌లో ప్రధాని మోడీ చెప్పిన అర్థమిదే.. (Video)

Yoga: సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. యోగా డేపై బాబు ప్రశంసలు

Yoga Day: జపాన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం.. బౌద్ధ ఆలయంలో యోగాసనాలు

Pawan Kalyan: యోగాంధ్రతో ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యం : పవన్ కల్యాణ్

Modi: అంతర్జాతీయ యోగా దినోత్సవం- నారా లోకేష్, పవన్‌లను ప్రశంసించిన ప్రధాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments