Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. స్నేహితులుండాల్సిందే..

మనుషుల మానసిక ఆరోగ్యం బాగుండాలంటే స్నేహితులు ఎక్కువమంది ఉండాలట. ఈ విషయాన్ని తాజాగా శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా నిరూపించారు. ఎక్కువ స్నేహితుల బృందాన్ని కలిగి ఉన్నవారే మానసికంగా ఆరోగ్యం పరంగా బాగుం

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:46 IST)
మనుషుల మానసిక ఆరోగ్యం బాగుండాలంటే స్నేహితులు ఎక్కువమంది ఉండాలట. ఈ విషయాన్ని తాజాగా శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా నిరూపించారు. ఎక్కువ స్నేహితుల బృందాన్ని కలిగి ఉన్నవారే మానసికంగా ఆరోగ్యం పరంగా బాగుంటారని ఆ పరిశోధనలో వెల్లడైంది.
 
దాదాపు 6 వేల మందిపై చేసిన అధ్యయనంలో వారికున్న స్నేహితుల సంఖ్య, మానసిక ఆరోగ్యానికి మధ్య గల సంబంధంపై పరిశోధన చేశారు. స్నేహితులు ఎక్కువగా వున్న మధ్య వయస్కులు, ఇతరులతో పోల్చితే వారు మానసికంగా దృఢంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. 
 
ఇక తక్కువగా లేదంటే అసలు స్నేహ మాధుర్యాన్ని చవిచూడని వారు మానసికంగా బలహీనంగా ఉన్నట్లు తేలింది. ఈ ఫలితాలు పురుషులు, మహిళల్లో ఒకేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కనుక ఎక్కువమంది స్నేహితులున్నవారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేసేయండి మరి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments