వేసవి ఎండలకు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఏంటి?

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (16:47 IST)
వేసవి ఎండలు ముదురుతున్నాయి. కనుక సీజనల్ గా వచ్చే పండ్లను శరీరానికి అందిస్తుండాలి. ముఖ్యంగా డీహైడ్రేషన్ కాకుండా వుండేందుకు నీటి శాతం అధికంగా వున్న పండ్లను తీసుకుంటూ వుండాలి. పండ్లలో పుచ్చకాయను తినటంవల్ల శరీరానికి ఎంతగానో మేలు జరుగుతుంది.

 
రుచితోపాటు బీ విటమిన్ అధికంగా ఉండే పుచ్చకాయ శరీరానికి శక్తినివ్వటమేగాక అందులో ఉండే పొటాషియం గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. వడదెబ్బ బారినుంచి కాపాడుతుంది. పోషకవిలువలు ఎక్కువగా ఉండే కీర దోసను కూడా ఎక్కువగా తీసుకోవాలి.

 
కొబ్బరి నీళ్లను కూడా వేసవిలో ఎక్కువగా తాగాలి. వీటిలోని ఖనిజ లవణాలు వేసవి నుంచి శరీరాన్ని చల్లబరుస్తాయి. దీంతో పాటు శరీరాన్ని తక్షణ శక్తి అందిస్తుంది. వేసవి తాపం నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సాధ్యమైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలి.

 
చెరకు రసాన్ని కూడా తీసుకోవాలి. ఈ రసంలో కార్బోహైడ్రేట్లు అపారంగా ఉంటాయి. దీంతో తక్షణ ఉపశమనం లభిస్తుంది. మూత్ర సంబంధ వ్యాధులతో బాధపడేవారు చెరకు రసం తీసుకుంటే చాలా మంచిది. వేసవిలో ఎప్పటికప్పుడు మజ్జిగలో నిమ్మరసం కలుపుకుని తాగితే చాలా మంచిది.

 
మసాలాలు, మాంసాహారానికి దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం ఉత్తమం. అలాగే శరీరానికి చల్లదనం ఇచ్చే అన్నిరకాల పండ్లను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఐస్ తక్కువగా వేసుకుని పండ్ల రసాలను కూడా ఎక్కువగా సేవించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments