Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిటికెడు కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగుతుంటే...

కుంకుమపువ్వు గురించి తెలియని వారు ఉండరు. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమపువ్వులో ధయామిన్, రైబోఫ్లెవిన్ ఉంటాయి. ఇది గర్భవతులకు ఎంతో మేలు చేస్తుంది. కుంకుమపువ్వును చిటికెడు మించకుండా పాలలో కలిపి ప్రతిరోజు తీసుకోవటం వలన జీర్ణక్రియ స

Webdunia
శనివారం, 26 మే 2018 (22:41 IST)
కుంకుమపువ్వు గురించి తెలియని వారు ఉండరు. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమపువ్వులో ధయామిన్, రైబోఫ్లెవిన్ ఉంటాయి. ఇది గర్భవతులకు ఎంతో మేలు చేస్తుంది. కుంకుమపువ్వును చిటికెడు మించకుండా పాలలో కలిపి ప్రతిరోజు తీసుకోవటం వలన జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్దక సమస్య తగ్గుతుంది. 
 
ఇది గర్భవతులకు ఆకలి పుట్టేలా చేస్తుంది. కనుక గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోవటం చాలామంచిది. అంతేకాకుండా దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మంచి రుచి, కమ్మటి వాసన ఇవ్వటం కోసం దీనిని కొన్ని రకాల వంటకాల్లో కూడా వాడుతుంటారు.  
 
దీని ప్రయోజనాలు ఏమిటంటే...
 
1. కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గించేవి, కడుపు పట్టేయటం వంటి సమస్యల్ని దూరం చేసే గుణాలు కుంకుమపువ్వులో సమృద్దిగా ఉన్నాయి.  
 
2. గుండె ఆరోగ్యాన్ని చక్కబరచడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్ నిలవల్ని కుంకుమపువ్వు తగ్గిస్తుంది.
 
3. కుంకుమపువ్వులో శరీరంలో తిరుగాడే హానికారక ఫ్రీ-ర్యాడికల్స్‌ను దెబ్బతీసే యాంటీ ఆక్సిడెంట్లు, శరీరంలో వాపు ఏర్పడకుండా నివారించే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ అంశాలు, డిప్రెషన్ కారకమైనవి, జ్ఞాపకశక్తిని పెంచేవి కూడా కుంకుమపువ్వులో పుష్కలంగా ఉన్నాయి.
 
4. శరీరంలో వేడి ఎక్కువుగా ఉన్నవారు కుంకుమపువ్వు తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.
 
5. కుంకుమపువ్వును సుగంధ ద్రవ్యాల్లో కూడా ఉపయోగిస్తారు.
 
6. కుంకుమపువ్వుని వివిధ రకాల క్యాన్సర్లకు చికిత్సగా వాడుతుంటారు. ఇది ఊపిరితిత్తులను శుభ్రపరచి ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది.
 
7. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. కుంకుమపువ్వుని వేడి పాలలో వేసుకొని తాగటం వల్ల మానసిక వత్తిడి తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తర్వాతి కథనం
Show comments