గుండె పదిలంగా వుండాలంటే.. రాత్రి 9 గంటల తర్వాత?

గుండెను పదిలం చేసుకోవడానికి ఈ టిప్స్ పాటించండి. పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనసు టీ, కాఫీల మీదకు లాగుతుంది. అదే పనిగా కాకుండా రోజులో రెండు కప్పులకు మించి తీసుకోకపోవడం మంచిది. తద్వారా గుండెను ఆరోగ్యంగ

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (17:08 IST)
గుండెను పదిలం చేసుకోవడానికి ఈ టిప్స్ పాటించండి. పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనసు టీ, కాఫీల మీదకు లాగుతుంది. అదే పనిగా కాకుండా రోజులో రెండు కప్పులకు మించి తీసుకోకపోవడం మంచిది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి. ఆరోగ్యమైన గుండె కోసం సాధ్యమయినంత వరకు ఇంటి ఆహారానికి ప్రాధాన్యమివ్వడం మంచిది. భుక్తాయాసంగా కాకుండా కాస్త వెలితిగా ఆహారం తీసుకోవడం ఉత్తమం.
 
ధూమపానము, మద్యపానానికి అలవాటు పడకూడదు. ఇది గుండె ఆరోగ్యానికి అనర్థం. నిద్రాభంగం కాకుండా చూసుకుంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రాత్రి 9.00 గంటల తర్వాత నీరు ఎక్కువగా త్రాగరాదు. ఎక్కువసార్లు నీరుడై నిద్రకి భంగము కలుగును. రాత్రి ఎనిమిది గంటల్లోపే డిన్నర్ పూర్తి చేయాలి. ఇలా చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 
నిమ్మరసం, ఖర్జూరాలు తినటం వల్ల అందులోని ఫోనోలిక్‌ యాంటీఆక్సిడెంట్స్‌ గుండెసంబంధింత వ్యాధులపై పోరాడుతాయి. బలమైన ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌ను తినటం మానాలి. మొలకెత్తిన విత్తనాలలో కొబ్బరి క్యారెట్‌లను తురిమి కొతిమీరతో కలిపి డేట్స్‌తో సహా అల్పాహారంగా తీసుకోవాలి. గోంగూర, తోటకూర, పాల కూర, బచ్చలికూర లేదా క్యారట్‌రసం సేవించటం చాలా మంచిది.
 
ఆకుకూరలన్నింటిలో మునగాకు అత్యంత బలమైన ఆహారం అన్న విషయాన్ని మరువకూడదు. ఉప్పు అధికంగా తినటం వల్ల ప్రమాదం వుంటుంది. కనుక వాటిని తగ్గించాలి. అలాగే నూనె, వేడిపదార్థాలను ఎక్కువగా తినటం మానాలి. జంక్ పుడ్స్ అసలు తినకూడదు. ఖర్జూరంలోని ఫినోలిక్‌ రాడికల్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ కొలెస్ట్రాల్‌‌పై పోరాడి తగ్గిస్తుంది.
 
గుండెని భ‌ద్రంగా ఉంచుకుంటే మ‌న మెద‌డు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం కోసం ఖర్జూరం, దానిమ్మ ఫలాలు తీసుకోవటం చాలా మంచిది. దానిమ్మపండు, ఖర్జూరాలు హార్ట్‌అటాక్‌ను రాకుండా కాపాడతాయి. కేవలం నాలుగు ఔన్సుల దానిమ్మరసంకు తోడు మూడు లేదా నాలుగు ఖర్జూరాలని తీసుకోవాలి. 
 
గుండె పదిలంగా ఉండాలంటే.. బీ6, బీ12 వంటివి ఉండే ఆహారం తీుసకోవాలి. మోతాదుకు మించి మద్యం సేవించకూడదు. పొగ తాగడం మంచిది కాదు. బీపీ, షుగర్‌లను తగ్గించుకోవాలి. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.
 
గుండెజబ్బులను నివారించడానికి లేదా గుండె జబ్బును కనుగొన్న తర్వాత దానిని అదుపులో పెట్టుకోడానికైనా నడక మంచి వ్యాయామం. అయితే ఆరుబయట లేదా ట్రెడ్‌మిల్‌పై నడవడం మంచిది. ఎక్కువ వేగంతో తక్కువ దూరాలు నడవటం కంటే... గుండెజబ్బులు ఉన్నవారు తక్కువ వేగంతో ఎక్కువ సమయం నడిస్తే మంచిది. మామూలుగా ఆరోగ్యం కోసం నడిచేవారు ఉదయం వేళ వాకింగ్ చేయడం మంచిది. 
 
ఒకవేళ గుండెజబ్బు నిర్ధారణ అయినవారు మాత్రం ఉదయం వేళ నడవడం మేలు. సాయంత్రాలు నడిచేవారు మాత్రం వాకింగ్ చేయడానికి ముందు మితంగా ఆహారం తీసుకోవాలి. కడుపు నిండా ఆహారం తీసుకుని వాకింగ్ చేయకూడదు. ఆరోగ్యక‌ర‌మైన జీవ‌న విధానం, చ‌క్క‌ని ఆహార‌పు అల‌వాట్లు, క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయ‌డం ద్వారా గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు. భోజ‌నం త‌రువాత వెంట‌నే న‌డుం వాల్చ‌డం చేయ‌కూడ‌దు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

తర్వాతి కథనం
Show comments