Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరం బరువు పెరగకుండా ఉండేందుకు ఇలా చేస్తే సరి...

కొన్ని రకాల పదార్థాలు మానేసి మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే. అయితే దాంతోపాటు చేసుకోవల్సిన మార్పులు మరికొన్ని ఉన్నాయి. ఉదయాన్నే అల్పాహారం, రెండుపూటల భోజనం.... ఇంతేగా అనుకుంటే చాలదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. దీ

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (20:10 IST)
కొన్ని రకాల పదార్థాలు మానేసి మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే. అయితే దాంతోపాటు చేసుకోవల్సిన మార్పులు మరికొన్ని ఉన్నాయి. ఉదయాన్నే అల్పాహారం, రెండుపూటల భోజనం.... ఇంతేగా అనుకుంటే చాలదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల తక్కువ కేలరీలు అందుతాయి. శరీరం ఇన్సులిన్‌ను తక్కువగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అదే ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువూ అదుపులో ఉంటుంది.
 
ఆకలితో సంబంధం లేకుండా మీముందు ఎంత ఎక్కువ ఆహారం ఉంటే అంత ఎక్కువగా తినేస్తారని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. దీన్ని అధిగమించాలంటే చిన్న పళ్ళెం తీసుకుని కొద్దిగానే వడ్డించుకోవాలి. దానివల్ల తెలియకుండానే తక్కువగా తీసుకుంటాం. కాఫీ, టీలు తాగే గ్లాసులకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎంత బిజీగా ఉన్నాసరే అన్నం ఒక్కటే కాదు. అల్పాహారం, స్నాక్స్ ఏవయినాసరే భోజనం చేసే డైనింగ్ టేబుల్ దగ్గర తినాలనే నియమాన్ని పెట్టుకోండి. ఫలితంగా టీ.వి, కంప్యూటరు ముందు కూర్చొని తినే అలవాటు తప్పుతుంది.
 
నోరూరించే పదార్థాలు ఎన్ని చేసుకున్నాసరే పచ్చి కూరగాయ ముక్కలు కూడా మీ ముందు ఉండేలా చూసుకోవాలి. ముందు వాటిని తిన్నాకే ఇతర పదార్థాలను తినాలనే నియమాన్ని పెట్టుకోవాలి. దానివల్ల పొట్ట నిండినట్లుగా ఉంటుంది. కేలరీలు తగ్గుతాయి.
 
ఐస్‌క్రీం తినే అలవాటును తగ్గించుకోండి. ఉదయాన్నే అల్పాహారం తిన్నాక ఓ గ్లాసు బత్తాయి, కమలా ఫలం రసం తాగండి. వాటివల్ల తక్కువ కేలరీలు అందుతాయి. శరీర బరువు అదుపులో వుంటుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments