పరోటా, కుర్మాలను లాగిస్తున్నారా?
దక్షిణ భారత దేశంలో ఏ రెస్టారెంట్‌కు వెళ్ళినా సర్వర్ల నోట పరోటా అనే పేరు బాగా వినిపిస్తుంది. కానీ మైదాలతో తయారయ్యే పరోటాలు అనేక వ్యాధులకు కారణం అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు దేశాల్లో నిషేధాన
దక్షిణ భారత దేశంలో ఏ రెస్టారెంట్‌కు వెళ్ళినా సర్వర్ల నోట పరోటా అనే పేరు బాగా వినిపిస్తుంది. కానీ మైదాలతో తయారయ్యే పరోటాలు అనేక వ్యాధులకు కారణం అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు దేశాల్లో నిషేధానికి గురైన పరోటా.. మన ఇంట వినియోగిస్తుంటాం.
అయితే మైదా ఎలాంటి రోగాలకు దారితీస్తుందో చూద్దాం.. మైదా కలిపిన ఆహార పదార్థాలను తీసుకుంటే మధుమేహం ఆవహిస్తుంది. మైదా చేర్చిన ఆహారాల్లో గ్లిసమిక్ అధికం. ఇది రక్తంలో అతి త్వరలో చక్కెర స్థాయులను పెంచేస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు పరోటాలకు దూరంగా వుండటం మంచిది.
ప్రస్తుతం మధుమేహం.. ఒబిసిటీకి పరోటాలు కారణమవుతాయి. పోషకాలు లేని పరోటాలను అనేకసార్లు తీసుకోవడం ద్వారా గుండెకు మంచిది కాదు. పిల్లల్లోనూ మైదా పిండితో చేసే పరోటాలు ఒబిసిటీకి దారితీస్తాయి. అలాగే నూనెలో వేపిన ఆహార పదార్థాలు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
ఈ చెడు కొలెస్ట్రాల్ ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. మైదా వల్ల అజీర్తి తప్పదు. పరోటాలను తీసుకోవడం ద్వారా పేగుల్లో బంకలాంటి పదార్థం చేరిపోతుంది. ఇది జీర్ణానికి అడ్డంకిగా మారుతుంది. గ్లూ ఆఫ్ ది గట్ అనే పిలువబడే ఈ పదార్థం పేగుల పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. అందుకే పరోటా, కుర్మాలను పక్కనబెట్టేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతామని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.