Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

ఠాగూర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (09:00 IST)
సాధారణంగా అనేక మందికి సాధారణ రోజుల్లోనే శరీరం నుంచి చెమట అధికంగా వస్తుంది. ఇక వేసవికాలంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటతో స్నానం చేస్తుంటారు. ఇలాంటి వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. ఇలాంటి వారు కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే చాలా మేరకు చెమట నుంచి విముక్తి పొందవచ్చు. అవేంటే తెలుసుకుందాం. 
 
ప్రతి రోజూ ఒక గ్లాసు టమాటో జ్యూస్‌ను తయారు చేసుకుని తాగితే ఉపయోగం ఉంటుంది. గ్రాస్ జ్యూస్ కూడా చెమటను తగ్గిస్తుంది. అలాగే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టమోటా లేదా గ్రాస్ జ్యూస్‌ సేవించడం వల్ల చెమట నుంచి చాలా మేరకు ఉపశమనం పొందవచ్చు. అలాగే, గ్రాస్ జ్యూస్‌లో విటమిన్ బి6, ప్రొటీన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి పోషకాలు బాగా లభిస్తాయి. 
 
చెమటను తగ్గించేందుకు మరో చిట్కా ఏంటంటే.. కార్న్‌ఫ్లార్, బేకింగ్ సోడా కాంబినేషన్‌. అర కప్పు కార్న్‌స్టార్చ్, అరకప్పు బేకింగ్ సోడా, కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని అండర్ ఆర్మ్స్‌కు పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేసే మెరుగైన ఫలితం లభిస్తుంది. అలాగే, మిత అల్పాహారంతో చెమట నుంచి కొంతమేరకు తగ్గించవచ్చు. 
 
అలాగే, టీ, కాఫీలు తక్కువగా సేవించడం. వీటితో పాటు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఆల్కహాల్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు, కారంగా ఉండే వంటకాలు ఎక్కువగా తినడం వల్ల కూడా చెమట ఎక్కువగా పడుంది. ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

తర్వాతి కథనం
Show comments