Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో తినకూడనవి ఏమిటో తెలుసా?

వేసవిలో కొన్ని పదార్థాలు నోరూరించినా వీలైనంతవరకు తగు మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే కడుపు ఉబ్బరంతో పాటు అజీర్ణం వంటి సమస్యలూ ఎదురుకావచ్చు. వాటిని అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే... 1. ఎండలు పెరిగే క్రమంలో రోజువారీ తీసుకునే ఆహారంల

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (21:58 IST)
వేసవిలో కొన్ని పదార్థాలు నోరూరించినా వీలైనంతవరకు తగు మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే కడుపు ఉబ్బరంతో పాటు అజీర్ణం వంటి సమస్యలూ ఎదురుకావచ్చు. వాటిని అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...
 
1. ఎండలు పెరిగే క్రమంలో రోజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలాల మోతాదును చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలోని వేడిని పెంచి జీవక్రియ రేటు మందగించడానికి కారణమవుతాయి.
 
2. మాంసాహారం కూడా అతిగా తినకూడదు. చికెన్, మటన్.... వంటివి ఈ కాలంలో జీర్ణ సంబంధ సమస్యల్నీ పెంచుతాయి. అరుగుదల మందగించడం, విరేచనాలు, మలబద్దకం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
 
3. వేసవిలో ప్రధానంగా బాధించేది డీహైడ్రేషన్. నీళ్లు ఎక్కువగా తీసుకున్నప్పటికీ కాఫీ, టీల మోతాదును తగ్గించుకోవాలి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ ఎదురుకావచ్చు. శరీరం కూడా తేమని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది.
 
4. నూనెలో వేయించినవి తగ్గించాలి. వేపుళ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ వంటివి వాటిని దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో వీటి జోలికి వెళ్లకూడదు. లేదంటే వికారం, అతిగా దాహం వేయడం వంటివి తప్పవు.
 
5. జంక్ పుడ్ కూడా ఈ కాలంలో మంచిది కాదు. ఇందులో అధికంగా కేలరీలు ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. పైగా పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటివి ఎదురవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments