Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి మధుమేహం వున్నవారి కోసం

Webdunia
గురువారం, 1 జులై 2021 (00:01 IST)
మన శరీరానికి  నీరు చాలా అవసరం.  ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్లలో ఒంట్లో నీరు తగ్గిపోతే  తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తుంది. కనుక వీరు సాధ్యమైనంత ఎక్కువుగా నీరు తాగుతూ ఉండాలి. పాలు, పెరుగు వంటి పాల పదార్ధాలను తీసుకోవచ్చు గానీ కొవ్వు ఎక్కువుగా ఉండే బటర్, చీజ్, నెయ్యిలకు దూరంగా ఉండటం మంచిది.
 
రోజుకి కనీసం మూడు సార్లయినా తాజా కూరగాయలు తీసుకోవాలి. క్యాబేజీ, పుదీనా, పాలకూర, కాకరకాయ, బెండకాయ, కాలీఫ్లవర్, దోసకాయ, క్యారెట్, ముల్లంగి, ఉల్లికాడలు, గుమ్మడికాయ మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి. తాజా పండ్లు తినటమూ మంచిదే. వీటిలో సహజంగా ఉండే చక్కెర సుక్రోజ్ కన్నా నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. అయితే చాలా తీయగా ఉండే మామిడి, అరటి వంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇలాంటి పండ్లను భోజనం చేసిన వెంటనే తింటే రక్తంలో గ్లూకోజ్ త్వరగా పెరుగుతుంది. 
 
మధుమేహం ఉన్న వాళ్లు ఎట్టి పరిస్ధితులలోను ఆహారం తినటాన్ని మానేయటం మంచిదికాదు. ప్రతిరోజు ఒకే సమయంలో భోజనం చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థిరంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. కేకులు, మిఠాయిలు, చాక్లెట్లు వంటి అధిక చక్కెర గల పదార్ధాలకు దూరంగా ఉండాలి. తీయటి పానీయాల జోలికి వెళ్లకపోవటం మంచిది.
 
ఎక్కువ నూనెతో వేయించే పదార్ధాలకన్నా ఉడికించినవి తినటం ఎంతో మంచిది. అలాగే అన్నం, ఆలుగడ్డ, అరటి వంటివి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటివి పెద్దమెుత్తంలో తినకుండా చూసుకోవాలి. మధుమేహులకు రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటం అన్ని విధాలా మంచిది. అన్నింటికన్నా ముఖ్యంగా రోజులో ఎప్పుడైనా సరే .. ఆహారాన్ని ఒకేసారి పెద్దమెుత్తంలో తినకుండా జాగ్రత్తపడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments