Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందారం, ఉసిరితో జట్టు రాలడం తగ్గించవచ్చు, ఎలా?

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (20:53 IST)
జుట్టు రాలే సమస్య నుంచి ఎలా బయటపడాలో చాలామందికి అర్థంకాక ఏవేవో మందులు వాడుతుంటారు. అలా ఏవేవో వాడేకంటే జుట్టు రాలకుండా వుండేందుకు ఇంట్లోనే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
 
మందారం: ఈ పూల రసాన్ని ప్రతిరోజూ కొబ్బరినూనె రాసుకున్నట్లుగా పట్టిస్తే జుట్టు రాలే సమస్య అదుపులో వుంటుంది. దీని కోసం ఎండబెట్టిన మందార పూలను నీళ్లలో వేసి మరిగించి, సన్నటి వస్త్రంలో వడకట్టి చల్లార్చుకోవాలి. ఈ రసాన్ని తలకు రాసుకోవాలి.
 
మందార తైలం: నాలుగు కప్పుల మందార పూల రసం లేదా కషాయానికి కప్పు కొబ్బరినూనె కలపాలి. ఆ తర్వాత నూనె మత్రమే మిగిలేలా సన్నటి మంటపై కాచి చల్లార్చాలి. దీనిని వడకట్టి శుభ్రమైన గాజు సీసాలో భద్రపరుచుకుని తల నూనెగా వాడుకోవాలి. దీనితో జుట్టు రాలడం తగ్గి, నల్లగా నిగనిగలాడుతుంది. 
 
ఉసిరి: ఇది తలకు ఔషధంలా పనిచేస్తుంది. తలస్నానం చేసేటపుడు చివరి మగ్గు నీళ్లు పోసుకునే ముందు అరకప్పు ఉసిరి రసంతో తలను తడపాలి. తర్వాత ఆఖరి మగ్గు నీళ్లను తలపై పోయాలి. దీనితో జట్టు రాలడం సమస్య తగ్గుతుంది. 
 
ఆమ్ల తైలం: నాలుగు కప్పుల ఉసిరి రసం లేదా కషాయానికి కప్పు కొబ్బరి నూనె కలిపి సన్నటి మంటపై నూనె మాత్రమే మిగిలేలా కాచాలి. చల్లారిన తర్వాత వడబోసి సీసాలో భద్రపరచుకోవాలి. దీన్ని నిత్యం తలకు వాడితే జట్టు రాలే సమస్య చాలమటుకు తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments