గురకకు చెక్ పెట్టాలా? వేడి పాలల్లో పసుపు పొడిని వేసి?

వెల్లకిలా నిద్రిస్తూ గురకపెడితే సమస్య తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోరు మూసుకొని గురకపెడితే నాలుకలో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. నోరు తెరచి గురకపెడితే గొంతులోని మృదువైన కణజాల సమస్యగా గు

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (10:37 IST)
వెల్లకిలా నిద్రిస్తూ గురకపెడితే సమస్య తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోరు మూసుకొని గురకపెడితే నాలుకలో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. నోరు తెరచి గురకపెడితే గొంతులోని మృదువైన కణజాల సమస్యగా గుర్తించాలి. వెల్లకిలా పడుకుని గురకపెడితే ప్రధాన సమస్యగా పరిగణించాలి. అయితే ఎలా నిద్రించినా గురక వస్తుంటే దాన్ని తీవ్ర సమస్యగా గుర్తించాలని వారు హెచ్చరిస్తున్నారు.
 
గురక సమస్య నుంచి దూరం కావాలంటే.. అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది. రెండు టీ స్పూన్ల పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక తగ్గుతుంది. అలాగే అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అర టీ స్పూన్‌ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది. 
 
మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు పీల్చితే గురక తగ్గిపోతుంది. ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడి చేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో పోసి పీల్చుతుంటే తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు  సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు

పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో

ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)

వాటర్ టెస్టులో పాసైన వందే భారత్ స్లీపర్ ట్రైన్ (వీడియో)

మహిళ ప్రాణాలు తీసిన కోతుల గుంపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కెరీర్‌ను మలుపుతిప్పంది : అనిల్ రావిపూడి

Sri Nandu: నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం : సైక్ సిద్ధార్థ.హీరో శ్రీ నందు

'మన శంకర వరప్రసాద్ గారు' బుకింగ్స్ ఓపెన్

Chiranjeevi: 100 మిలియన్ వ్యూస్ దాటి చార్ట్‌బస్టర్‌గా నిలిచిన మీసాల పిల్ల

Raviteja: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి లపై వామ్మో వాయ్యో సాంగ్

తర్వాతి కథనం
Show comments