చుండ్రు వదలిపెడుతుందా.. గోకే వరకూ వదిలిపెట్టదు

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (20:26 IST)
చుండ్రు సమస్య వున్నవారు అదేపనిగా తలలో చేతులు పెట్టి గోకుతూ వుంటారు. ఎవరైనా చూస్తారన్నది కూడా పట్టించుకోరు. ఐతే ఈ అలవాటు పదిమందిలో ఇబ్బందికి గురిచేస్తుంది. కొంతమంది ఈ అలవాటును మానుకుందామని ప్రయత్నించినా చుండ్రు వదలిపెడుతుందా.. గోకే వరకూ వదిలిపెట్టదు.
 
ఈ మొండి చుండ్రును వదిలించుకునేందుకు వేపాకుల్ని నూరి ముద్దగా చేసుకొని కప్పు పెరుగులో కలుపుకోవాలి. దానికి రెండు చుక్కల ఆలివ్ నూనె, కోడిగుడ్డులోని తెల్లసొన కలుపుకొని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే త్వరలోనే సమస్య దూరమవుతుంది. 
 
మెంతులను పెరుగుతో నూరి తలకు పట్టిస్తే చుండ్రు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గసగసాలను పాలతో నూరి.. తలకు లేపనం వేస్తే చుండ్రు తగ్గుతుంది. వేపనూనె, కానుగనూనె సమంగా కలిపి అందులో కొంచెం కర్పూరం వేసి రాస్తే చుండ్రు చాలా వేగంగా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మందార పూల రసానికి సమంగా నువ్వుల నూనె చేర్చి, నూనె మాత్రమే మిగిలేంత వరకు కాచాలి. ఆ నూనెను తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ చుండ్రుపై సమర్థవంతంగా పనిచేస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను తీసుకుని వేడిచేయాలి. దానికి అంతే పరిమాణంలో నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. జుట్టు అంతటా విస్తరించేలా, కుదుళ్లకు తగిలేలా సున్నితంగా మసాజ్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుమార్తె - అల్లుడి ప్రాణాలు తీసిన అత్త - మామల అత్యాశ

పెళ్లి ఊరేగింపుపై సాయుధ దుండగుల దాడి.. వధువు బంగాలు నగలు లూటీ

జూన్ 30, 2026 మంగళవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?

Sai Durgha Tej: సంబరాల ఏటిగట్టు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో రిలీజ్

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

Nabha Natesh: నాగబంధం షూటింగ్ లో చాలా నియమనిష్టలతో పని చేశాం :నభా నటేష్

తర్వాతి కథనం
Show comments