సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

ఠాగూర్
గురువారం, 27 నవంబరు 2025 (12:56 IST)
వేసవికాలంలో మామిడి పండు ఎలాగో.. శీతాకాలంలో లభించే పండ్లలో అతి మధురమైన ఫలం సీతాఫలం. ఈ ఫలాలు రుచిలోనే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లను కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరగించకూడదని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా అలెర్జీతో బాధపడేవారు, జీర్ణసమస్యలు ఉన్నవారు, అధిక ఐరన్ సమస్యలు ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు లేదా కడుపు నిండిన భావన వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. 
 
అలాగే, సీతాఫలం ఐరన్‌కు మంచిఫలం. అయితే, అధికంగా తీసుకుంటే అద శరీరంలో ఐరన్ స్థాయిని పెంచుతుంది. ఇది కడుపునొప్పి, వికారం, మలబద్దకం, కడుపు పొర, వాపు, పూతలు వంటి సమస్యలను కలిగిస్తుంది. కొంతమందికి సీతాఫలం ఆరగించడం వల్ల దురద, దద్దుర్లు, చికాకు లేదా ఇతర అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉండటం ఎంతో మంచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments