Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఒక గ్లాసు బీరకాయ రసం తాగితే...

ప్రస్తుత సీజన్‌లో బీరకాయలు చాలా చౌకగా విరివిగా దొరకుతుంటాయి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీరకాయలో సి విటమిన్, ఐరన్ రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థయామిన్‌తో పాటు అనేక రకాల ఖనిజ లవణాలుంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రా

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (13:57 IST)
ప్రస్తుత సీజన్‌లో బీరకాయలు చాలా చౌకగా విరివిగా దొరకుతుంటాయి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీరకాయలో సి విటమిన్, ఐరన్ రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థయామిన్‌తో పాటు అనేక రకాల ఖనిజ లవణాలుంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచి ఆహారం. 
 
సెల్యులోజ్, నీటిశాతం బీరకాయలో ఎక్కువ కావున మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధపడేవారికి ఇది చక్కని ఉపశమాన్ని ఇస్తుంది.  రక్తంలోనూ మూత్రంలోనూ చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకుంటే చాలా మంచిది. ఇందులో బీటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. 
 
బీరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమలు, యాక్నె సమస్యలు తొలగిపోతాయి. దేహం నుంచి ఆల్కహాల్ కారక వ్యర్థాలను తొలగించి కాలేయం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కామెర్ల వ్యాధి సహజంగా తగ్గాలంటే రోజూ ఒక గ్లాసు బీరకాయ రసం తాగితే చాలు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

తర్వాతి కథనం
Show comments