Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతు గరగర... భరించలేని గొంతునొప్పి... ఇలా చేస్తే పోతుంది...

వర్షాకాలంలో జలుబుతో పాటు వచ్చే గొంతులో మంట, నొప్పి ఎంతగానో బాధిస్తుంటాయి. కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు వాతావరణంలో మార్పు, నీటిలో తేడా, గాలిలో కాలుష్యం వల్ల గొంతు సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి చక్కని చిట్కాలు.... 1. టేబ

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (12:46 IST)
వర్షాకాలంలో జలుబుతో పాటు వచ్చే గొంతులో మంట, నొప్పి ఎంతగానో బాధిస్తుంటాయి. కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు వాతావరణంలో మార్పు, నీటిలో తేడా, గాలిలో కాలుష్యం వల్ల గొంతు సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి చక్కని చిట్కాలు....
 
1. టేబుల్ స్పూన్ గళ్ళ ఉప్పు లేదా వంట సోడాను గ్లాస్ గోరువెచ్చని నీటిలో కరిగించి ఆ నీటిని పుక్కిలించాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే ఉప్పు యాంటిసెప్టిక్‌గా పనిచేసి గొంతును శుభ్రం చేసి నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తుంది. బీపి ఉన్నవాళ్లు ఈ పని చేయరాదు.
2. వేడి నీటిలో కాస్త తేనే వేసుకొని తీసుకుంటే గొంతునొప్పి నుంచి త్వరగ ఉపశమనం పొందవచ్చు.
3. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి రోజు తీసుకుంటే గొంతు సమస్యలు తొలగిపోతాయి.
4. దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తింటే దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది.
5. మిరియాల పొడిని కాస్త తేనెలో కలిపి తినటం లేదా పాలల్లో మిరియాలపొడి కలిపి తాగినా గొంతు సమస్యలు తగ్గుతాయి.
6. గొంతులో మంటగా ఉంటే వెల్లుల్లి రెబ్బను తింటే గొంతులో మంట తగ్గుతుంది.
7. గొంతులో గరగర వంటి సమస్యలు పోవాలంటే ఉల్లిపాయ రసం సేవించడం లేదా అల్లంతో చేసిన టీని గాని అల్లాన్ని నీటిలో ఉడికించి ఆ నీటిని గాని సేవిస్తే గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

నీతో మాట్లాడాలి రా అని పిలిచి మహిళా జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఆ మూడు పార్టీలకు అగ్నిపరీక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

తర్వాతి కథనం
Show comments