వేసవికాలంలో చమట పొక్కుల నుండి ఉప‌శ‌మ‌నం ఎలా..?

బియ్యము లేక నూకలు విసిరి పిండిగా చేసి, ఈ మెత్తటి పిండిలో కొద్దిగా నీరు చేర్చి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను వంటికి అంతట పూసి, 3 -4 నిముషాలు ఆగి, సబ్బు వాడకుండా, శుభ్రంగా స్నానము చేయాలి. ఇలా వారానికి 3 సార్లు స్నానము చేస్తే చర్మంపై ఉన్న చమటకాయలు తగ్గి

Webdunia
మంగళవారం, 3 మే 2016 (13:55 IST)
బియ్యము లేక నూకలు విసిరి పిండిగా చేసి, ఈ మెత్తటి పిండిలో కొద్దిగా నీరు చేర్చి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను వంటికి అంతట పూసి, 3 -4 నిముషాలు ఆగి, సబ్బు వాడకుండా, శుభ్రంగా స్నానము చేయాలి. ఇలా వారానికి 3 సార్లు స్నానము చేస్తే చర్మంపై ఉన్న చమటకాయలు తగ్గిపోయి శరీరం నునుపుగా మారుతుంది. ఎండాకాలం చికాకు తొలగిపోయి హాయిగా ఉంటుంది.
 
ఈవిధంగా చేసిన త‌రువాత‌, చర్మంపై మరిన్ని చమటకాయలు రాకుండా ఉండటానికి స్నానం చేసిన తర్వాత మంచి గంధాన్ని అరగదీసి చేతులు, వీపు, మెడ, నడుముకు రాసుకోవాలి. అలాగే స్నానం చేసే ముందు తులసి ఆకులు, తమలపాకులు కలిపి దంచి ఆ మిశ్రమాన్ని ఒళ్ళంతా రుద్దుకొని ఓ గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చమటకాయల సమస్య నుంచి బయటపడవచ్చు.
 
వేసవిలో ఆకుకూరలు, కాయగూరలు అధికంగా వాడాలి. పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పండ్లరసాలు మేలు చేస్తాయి. అలాగే ఉదయం వేళల్లో ఇడ్లీ, ఉప్మా వంటి తేలిక పదార్ధాలు తీసుకుంటే మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బ్యాంక్ లాకర్‌లో రూ. 1.50 కోట్ల నగదు.. ఏసీబీ చిక్కిన నరహరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

నీట్ యూజీ- 2026.. అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ వేసిన ఎన్టీఏ.. విద్యార్థి షాక్

క్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో దోపిడీ, వేధింపులు.. 17ఏళ్ల బాలుడిపై దాడి

ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డుగా వున్నాడని రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి

రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించాలి.. తల పట్టుకున్న ఎన్డీయే.. ప్లాన్ ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Allu Arjun Court: అల్లు అర్జున్ తప్పనిసరిగా హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు

Vishal : మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా పాట

నాగబంధం ఛేదించి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రవేశించారా?

తర్వాతి కథనం
Show comments