Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలకరి జల్లులు మొదలు... అలెర్జీలు వచ్చేస్తాయ్... ఏంటివి? ఎదుర్కొనేదెలా?

తొలకరి చినుకులు మొదలయ్యాయి. బండలు పగిలే ఎండల నుంచి చినుకులతో భూమి ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఇలా వాన చిలుకులతోపాటు ఆ వెంటనే చాలామందికి అలెర్జీ సమస్య కూడా వచ్చేస్తుంది. ఈ అలెర్జీ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం... * తరచూ తలనొప్పి రావడం లేదా ఒత్తిడ

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (12:12 IST)
తొలకరి చినుకులు మొదలయ్యాయి. బండలు పగిలే ఎండల నుంచి చినుకులతో భూమి ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఇలా వాన చిలుకులతోపాటు ఆ వెంటనే చాలామందికి అలెర్జీ సమస్య కూడా వచ్చేస్తుంది. ఈ అలెర్జీ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం...
 
* తరచూ తలనొప్పి రావడం లేదా ఒత్తిడి పెరగడం.
* నరాలు బలహీనంగా ఉండటం, శారీరకంగా బలహీనంగా మారిపోవడం లేదా నిరుత్సాహంతో కొట్టుమిట్టాడుతుండటం.
* ఆస్తమా
* ముక్కు దిబ్బడ, తరచూ జలుబుతో బాధపడుతుండటం.
* తరచూ ముఖం, కళ్ళు వాచిపోతుండటం.
 
అలర్జీకి ప్రకృతిపరమైన చికిత్స 
* తరచూ ఆహారంగా చాక్లెట్లు, చల్లటి ద్రవపదార్థాలు, మద్యపానం, చక్కెర, చికెన్, ధూమపానం, పాలు, మజ్జిగ తీసుకోకూడదు. 
* అలర్జీగా ఉన్నప్పుడు 125 మిల్లీ గ్రాముల విటమిన్ బీ5 మాత్రలు వాడండి. లేదా పాంటోథెనిక్ యాసిడ్‌‌ను ప్రతి రోజు వాడాలి. ఇలా రెండు- మూడు నెలలు వాడితే అలర్జీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
* విటమిన్ ఇ 300 మిల్లీ గ్రాముల బిళ్ళలు ఆరు వారాలపాటు వాడాలి. ఇది శరీరంలోని అలర్జీని పారద్రోలేందుకు చాలా దోహదపడుతుందంటున్నారు వైద్యులు. 
 
* అలర్జీని పారద్రోలే అత్యంత దివ్యమైన ఔషధం మంచినీరు. ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని తాగుతుంటే ఆ నీరు శరీరంలోని మ్యూకస్‌ను బయటకు తరిమేస్తుంది. దీంతో అలర్జీ నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 
* ఇంట్లో ఉన్నప్పుడు లేదా వాహనాలలో ప్రయాణించేటప్పుడు కిటికీలు మూసివుంచండి. దీంతో దుమ్ము ధూళి నుంచి మీరు బయటపడగలరు. అలాగే దుమ్ము, ధూళి లేకుండా ఇంటిని రోజూ శుభ్రపరుచుకోండి. 
 
మూలికలతో చికిత్స : 
జలుబు, ముక్కు దిబ్బడగా ఉన్నప్పుడు జీలకర్ర, సోంపు, నువ్వులు, చెరి 50 గ్రాములు కలుపుకుని వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక చెంచా నల్ల ఉప్పు కలుపుకోవాలి. దీనిని ఓ గాజు సీసాలో భద్రపరచుకోండి. ప్రతిరోజు భోజనం తీసుకున్న తర్వాత పైన చెప్పబడిన మిశ్రమంలోంచి అరచెంచా సేవించండి. దీంతో శరీరంలో ఎటువంటి అలర్జీ నైనా ఈ మిశ్రమం తొలగిస్తుందంటున్నారు వైద్యులు.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments