Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు బాగా ఊడిపోతుందా? ఉల్లిపాయ రసాన్ని కుదుళ్ళకు పట్టించండి!

ప్రస్తుతం యూత్‌ని విపరీతంగా వేధిస్తున్న సమస్య జట్టురాలడం. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా బట్టతల రాకుండా, జుట్టు ఊడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నష్టం వాటిల్లుతూనే ఉంది. కొంతమందిలో 30 సంవత్స

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (15:05 IST)
ప్రస్తుతం యూత్‌ని విపరీతంగా వేధిస్తున్న సమస్య జట్టురాలడం. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా బట్టతల రాకుండా, జుట్టు ఊడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నష్టం వాటిల్లుతూనే ఉంది. కొంతమందిలో 30 సంవత్సరాలకే సగం జుట్టు పోయి బట్ట తల సమస్యను ఎదుర్కొంటున్నారు. బట్టతలపై జుట్టును రాబట్టుకోవడం దాదాపు అసాధ్యంతో కూడుకున్న పని అలా రాబట్టుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అయితే ఖర్చు చేయకుండా సులభంగా జుట్టును రాబట్టుకోవచ్చు.  చిన్న చిన్న ఇంటి చిట్కాలును పాటించడం వల్ల కోల్పోయిన  జుట్టును తిరిగి పొందవచ్చు.
 
మన వంటింట్లో ఉండే ఉల్లిపాయ రసంతో జుట్టు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వారంలో రెండు సార్లు ఉల్లిపాయ రసాన్ని కొబ్బరినూనె కలిపి కుదుళ్ళపై రాసుకుంటే రాలిన జుట్టు మళ్లీ  వస్తుంది. ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్‌ జుట్టు పెరగడంలో ఉపయోగపడుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. 
ఎండిన ఉసిరికాయలను తీసుకుని నీళ్లల్లో రాత్రంతా కూడా నానబెట్టాలి. అలా నానబెట్టిన నీటిలోనే ఉసిరికాయల గుజ్జును పిండాలి. ఆ నీటిని తలకు బాగా పట్టించి, గంట సమయం ఉండాలి. ఆ తర్వాత చల్లని నీటితో తలస్నానం చేస్తే మంచి ఒత్తయిన జుట్టు రావడం ఖాయం. 
 
మందారం పువ్వుతో కూడా జుట్టు సంరక్షించుకోవచ్చు. పది మందార పువ్వులు తీసుకుని పేస్ట్‌ చేసి, దానికి ఆముదం కలిపి తలకు పట్టించాలి. 20 నుండి 30 నిమిషాలు ఉంచి చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా ఉండటంతో పాటు బలంగా ఉండి, ఒత్తుగా పెరుగుతుంది. 
 
జుట్టు బలంగా ఉండటానికి, పెరగడానికి ఆముదం, ఉసిరి నూనెను తీసుకుని రాత్రి సమయంలో జుట్టుకు రాయాలి. మాడకు బాగా మర్దనా చేయాలి. అలా చేసి ఉదయానే షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

తర్వాతి కథనం
Show comments