బంగాళా దుంపల జ్యూస్... తాగితే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (16:28 IST)
ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో బంగాళదుంపలు ఒకటి. వీటితో అనేక రకాల వంటకాలు చేసుకుని తింటుంటాము. ముఖ్యంగా, ఆలూ ఫ్రై, పులుసు, టమోటా వంటి కూరలను, వివిధ రకాల చిప్స్‌ను తయారు చేసుకుంటాం. అయితే కేవలం వంటలతోనే కాకుండా, ఆలూ జ్యూస్‌తో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. 
 
 1. బంగాళాదుంపల జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి.
 
 2. ఆలుగడ్డ జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఈ జ్యూస్‌ను తాగితే కీళ్ల నొప్పులు పోతాయి. బంగాళాదుంపల జ్యూస్‌తో మైగ్రేన్‌ నొప్పి మటుమాయమై పోతుంది.
 
3. శరీరానికి రోజువారీగా కావల్సిన బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. లివర్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అంతేకాకుండా బంగాళదుంపను తీసుకోవడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది.
 
4. ఆలుగడ్డల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలకు సపోర్ట్‌ను ఇస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
 
5. ఆలుగడ్డలను తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ ఈ జ్యూస్‌ తాగితే బరువు తగ్గుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
 
6. పొటాటో జ్యూస్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే, జీర్ణాశయం, పేగుల్లో ఏర్పడే అల్సర్లను నివారిస్తుంది.
 
7. ఈ జ్యూస్‌లో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
 
8. ఆలుగడ్డలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేస్తుంది. రక్తహీనత సమస్య పోతుంది. కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు పోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

తర్వాతి కథనం
Show comments