Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి పశువులు తినేవని అంటారు కానీ... మనుషులు తింటేనా?

మన శరీరానికి పోషకాలు అందించడంలో జొన్నలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. వెనుకటి కాలంలో జొన్నలను ఆహారంలో భాగంగా ఎక్కువగా ఉపయోగించేవారు. జొన్న సంకటి, జొన్న రొట్టెలు లాంటివి చేసుకుని తినేవారు. అందువల్ల అప్పట్లో మనుషులు వ్యాధుల బారిన పడకుండా దృఢంగా ఉండేవారు. ప్ర

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (14:52 IST)
మన శరీరానికి పోషకాలు అందించడంలో జొన్నలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. వెనుకటి కాలంలో జొన్నలను ఆహారంలో భాగంగా ఎక్కువగా ఉపయోగించేవారు. జొన్న సంకటి, జొన్న రొట్టెలు లాంటివి చేసుకుని తినేవారు. అందువల్ల అప్పట్లో మనుషులు వ్యాధుల బారిన పడకుండా దృఢంగా ఉండేవారు. ప్రస్తుత కాలంలో సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక రకములైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జొన్నలు వాడకం బాగా తగ్గింది. ఇందులో అనేక రకములైన పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో చూద్దాం.
 
1. జొన్నల్లో పిండిపదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థం, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో విటమిన్ బి1, బి2, బి3, బి5 విటమిన్లు క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
 
2. పీచు పదార్థం పుష్కలంగా ఉండటంతో జొన్నలు జీర్ణకోశానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని చెడు కొవ్వుని నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకల దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 
3. జొన్నల్లో ప్రోటీన్సు, ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఈ జొన్నలని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జొన్నలు త్వరగా ఆకలి కాకుండా చూస్తాయి.
 
4. వీటిల్లో నియాసిన్ అనే బి6 విటమిన్ ఉంటుంది. ఇది తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణమై శక్తిలాగా మారడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల శరీరంలోని క్యాలరీలు పేరుకుపోకుండా ఉంటాయి. తద్వారా శరీర బరువు తగ్గుతుంది. 
 
5. జొన్నలు బాలింతలకు చాలా మంచివి. వీటిల్లో ఉండే ప్రోటీన్సు పిల్లల ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడతాయి.
 
6. క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులను దూరం చేసేందుకు జొన్నలు ఎంతగానో సహకరిస్తుంది. అందుకే సరైన ఆరోగ్యానికి జొన్నలు చాలా అవసరం. 
 
7. జొన్నలు శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రోటీన్లు, శక్తినిచ్చే పదార్దాలతో పాటు రక్త వృద్దికి తోడ్పడే ఇనుము, ఫోలిక్ ఆమ్లాన్ని శరీరానికి అందిస్తుంది. అయితే ఇతర ధాన్యాల కన్నా జొన్నల్లో ఇనుము, జింకు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొందరికి జొన్నలనగానే పశువులకు పెట్టేవి మనం తినడమా అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు. జొన్నల్లో పోషకాలు వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అరేయ్ తమ్ముడూ... నీ బావ రాక్షసుడు, ఈసారి రాఖీ కట్టేందుకు నేను వుండనేమోరా

ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బు అరేంజ్ చేయలేక.. అడవిలో ఉరేసుకుని?

Himayathnagar: అపార్ట్‌మెంట్ నుంచి దూకేసిన మహిళ.. గదిలో దేవుడు, మోక్షం అంటూ నోట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments