Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నాలుగూ నూరి బఠాణి గింజంత మాత్రలుగా చేసి మగవారు తీసుకుంటే...

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (17:15 IST)
పచ్చ కర్పూరం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏవిధంగా ఉపయోగపడతాయో చూద్దాం.
 
1. చిటికెడు బెల్లం చిటికెడు పచ్చకర్పూరం కలిపి తీసుకున్నట్లయితే ఉబ్బసం వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది.
 
2. ఈ పచ్చకర్పూరం రెండు పలుకులు తీసుకుని కాస్త గంధం కాని, కాస్త వెన్నను కాని కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసం మింగినట్లయితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం వెంటనే తగ్గిపోతుంది. తలతిరగడం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం ఇలాంటివి ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతాయి.
 
3. మహిళల్లో మర్మావయవాల దురద తగ్గాలి అంటే పచ్చ కర్పూరాన్ని రోజ్ వాటర్‌లో కలిపి మెత్తగా నూరాలి. దీనిలో దూదిని ముంచి దురద ఉన్న చోట 15 నిమిషాలు ఉంచి ఆ తరువాత కడిగివేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
4. శృంగార కోరికలు పెంచుకోవడానికి చాలామంది వయాగ్రా టాబ్లెట్స్ వాడుతుంటారు. కాని వీటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పచ్చకర్పూరంతో సహజసిద్ధమైన వయాగ్రాని తయారుచేసుకోవచ్చు. 
 
5. సహజసిద్ధంగా ఎలా తయారుచేసుకోవచ్చంటే.. పచ్చకర్పూరం-5 గ్రాములు, జాజికాయ-5 గ్రాములు, జాపత్రి- 5గ్రాములు, ఎండుద్రాక్ష- 5గ్రాములు. వీటన్నిటిని తీసుకుని వీటిని బాగా నూరి చిన్నచిన్న గింజలుగా చేయాలి. అంటే బఠాణి గింజంత మాత్రలుగా చేయాలి. వీటిని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని ఒక గ్లాసు పాలు తాగడం వల్ల వీర్యవృద్ధి చెందడమే కాక శృంగార సామర్ద్యం కూడా మెరుగవుతుంది.
 
6. నిత్యం వెల్లుల్లి వాడటం వల్ల శృంగారాన్ని పెంపొందించి వీర్యాన్ని వృద్ధి చేస్తుందని ఈమధ్య జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం కూడా వెల్లుల్లికి ఉందని నిరూపించబడింది. రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి దానిలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే పురుష వ్యక్తిగత భాగానికి కావల్సిన రక్తసరఫరా జరిగి శృంగార శక్తిని పెంచుతుంది మరియు వీర్యవృద్ధిని కలిగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments