Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మరసం వేడి నీటిలో కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?

ఉదయం నిద్రలేస్తూనే గోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచిదని అందరికీ తెలుసు. కాని దేనికి ఎంత వరకు ప్రాధాన్యమివ్వాలో, ఎలా తాగాలో చాలామందికి తెలియదు. ఈ ఫార్ములా మంచిదే కదా అని కొందరు అధికంగా నిమ్మరసాన్ని వాడుతుంటారు. అలా చేస్తే పులు

Webdunia
గురువారం, 18 జనవరి 2018 (21:00 IST)
ఉదయం నిద్రలేస్తూనే గోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం, తేనె  కలుపుకుని తాగితే మంచిదని అందరికీ తెలుసు. కాని దేనికి ఎంత వరకు ప్రాధాన్యమివ్వాలో, ఎలా తాగాలో చాలామందికి తెలియదు. ఈ ఫార్ములా మంచిదే కదా అని కొందరు అధికంగా నిమ్మరసాన్ని వాడుతుంటారు. అలా చేస్తే పులుపు పండ్ల చిగుళ్లు దెబ్బతింటాయి.
 
అందుకే.. సగం నిమ్మపండుకంటే ఎక్కువ వాడకూడదు. నిమ్మకు బరువు తగ్గించే గుణం ఉంది కదా అని దానిని ఎక్కువ వాడితే ఎసిడిటీ వృద్ధి చెందుతుంది. అది చేసే అసలు పనికి ఆటంకం ఏర్పడుతుంది. మోతాదుకు మించి వాడొద్దు. వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగే ముందు.. మామూలు నీళ్లతో నోటిని రెండుమూడుసార్లు పుక్కిలించిన తర్వాతే తాగాలి. లేదంటే బ్రెష్ చేసుకుని తాగితే ఇంకా మంచిది. లేకపోతే నోట్లోని బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంది. 
 
చాలామంది జిమ్, జాగింగ్ వెళ్ళినప్పుడు దుకాణాల్లో బాటిళ్లలో విక్రయించే నిమ్మరసం తాగుతుంటారు. ఆరోగ్యానికి అది ఏమాత్రం మంచిది కాదు. ఇంట్లోనే సహజమైన నిమ్మకాయలను పిండుకున్న నీటిని తాగితేనే బెటర్. నీళ్లు నిమ్మరసంలోకి మోతాదుకు మించి తేనెను కలుపకూడదు. కొందరైతే వేడినీటి నీటిలోకి తేనెను కలిపేస్తుంటారు. ఈ అలవాటూ ఆరోగ్యకరమైనది కాదు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments