Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీపిని తినటం నియంత్రించుకోవటం ఎలా?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (14:05 IST)
మితిమీరి తీపి తింటే అనర్థాలకు దారి తీస్తుందని తెలిసినా.... మనసు అటువైపే లాగుతుంది. అలాంటప్పుడే ఎలా నియంత్రించుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం...
 
పంచదార వాడేవారు దానికి బదులుగా కొన్ని రోజులు బెల్లం, తేనె వంటివి ఎంచుకోవాలి. అలానే కొన్నింట్లో చక్కెర వినియోగాన్ని తగ్గించి, పండ్ల గుజ్జును వాడుకోవచ్చు. ఇలాంటివి చేస్తే తీపి తినాలనే కోరికను తగ్గిస్తాయి.
 
ఒకేసారి తీపి మానేయలేం అనుకుంటే... కొద్దికొద్దిగా తగ్గించుకుంటూ రావాలి. అంటే కాఫీ, టీలలో రెండు చెంచాల చక్కెర వేసుకునే అలవాటు ఉంటే, ఒక చెంచాకు పరిమితం చేయండి. ఇలా చేస్తూనే కొంత కొంత తగ్గించుకుంటూ రావాలి.
 
వీలైనంత వరకూ ఐస్‌క్రీంలు, చాక్లెట్లు, కేక్‌లు లాంటివి తినటం మానేయండి. మొదట్లో ఇది కష్టంగానే అనిపించొచ్చు కానీ, క్రమంగా అలవాటైపోతుంది. కనీసం వారం, పదిరోజులు అలాంటి తీపి పదార్థాలను మానేస్తే... ఇలా చేస్తే తరహాలో కొంత వరకు ఫలితం కానవస్తుంది. కొందరికి భోజనం చేసిన వెంటనే ఏదో ఒక తీపి  తినాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఓ పండు తీసుకోండి. క్రమంగా తీపి తినాలనే ఇష్టం కూడా తగ్గుతుంది. ఇలా మనకు మనమే నియంత్రించుకోవచ్చు. దాన్ని వలన మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments