Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ దీన్ని ఒక ముక్క తినిపించాలి...

బంగారు రంగుతో చూడటానికి అందంగా, తియ్యగా, మంచి వాసనతో ఉండే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా మందులలో వాడుతారు. సాధారణంగా చెరకు రసం నుంచి బెల్లాన్ని తయారుచేస్తారు. తాటి నుంచి కూడా బెల్లం తయారవుతుంది. బెల్లంల

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (21:58 IST)
బంగారు రంగుతో చూడటానికి అందంగా, తియ్యగా, మంచి వాసనతో ఉండే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా మందులలో వాడుతారు. సాధారణంగా చెరకు రసం నుంచి బెల్లాన్ని తయారుచేస్తారు. తాటి నుంచి కూడా బెల్లం తయారవుతుంది. బెల్లంలో పంచదార లాగా పెద్దగా రసాయనాల వాడకం ఉండదు. పైగా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల నుంచి 350 గ్రాముల శక్తిని, 95 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 55 గ్రాముల కాల్షియం, 40 గ్రాముల పాస్పరస్, 2.6 మిల్లీ గ్రాముల ఐరన్ బెల్లంలో దొరుకుతుంది. 
 
చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. తియ్యటి పదార్థాలకు చక్కెర కన్నా బెల్లం మేలు. రోజూ బెల్లం ముక్క తినే వారిలో రక్తశుద్ధి జరిగి వ్యాధులు తగ్గుముఖం పడతాయి. లివర్ లోని వ్యర్థాలను బయటకు పంపించి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి జీర్ణసంబంధింత సమస్యలు రాకుండా చూస్తుంది. 
 
బెల్లంలోని యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, రోగనిరోధక శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ ఇన్ఫెక్షన్లను వ్యతిరేకంగా పోరాడుతాయి. బెల్లంలో పుష్కలంగా లభించే ఐరన్, ఫ్లోరిక్ యాసిడ్‌లు మహిళల్లో రక్తహీనతను నివారిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. బెల్లం గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బెల్లం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉండి జ్ఞాపకశక్తి బాగా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments